భారత మహిళల సాఫ్ట్‌బాల్ జట్టులో తెలంగాణ యువతికి చోటు
X
చైనాలోని హాంగ్‌జౌలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల సాఫ్ట్‌బాల్ జట్టు అరంగేట్రం చేయనుంది. 16 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించింది. సెప్టెంబర్ 23న ప్రారంభమయ్యే కాంటినెంటల్ ఈవెంట్‌కు ఒక స్టాండ్‌బై ప్లేయర్‌తో టీమ్‌ను సెలెక్ట్ చేశారు. ఈ మహిళల సాఫ్ట్‌బాల్ జట్టులో తెలంగాణ యువతికి చోటు దక్కింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మమత గుగులోత్ ఆసియా క్రీడల్లో తన సత్తా చాటేందుకు సన్నద్ధమవుతోంది.
మమత భువనగిరిలోని డిగ్రీ కాలేజీలో బీఏ సెకెండ్ ఇయర్ చదువుతోంది. నిజిమాబాద్ జిల్లా సుద్దపల్లిలోని సాంఘిక సంక్షేమ స్పోర్ట్స్ అకాడమీలో నీరజ రెడ్డి ఆధ్వర్యంలో సాఫ్ట్‌బాల్ క్రీడలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంది. మమత గత 8 ఏళ్లుగా నేషనల్ లెవెల్లో క్రీడాకారిణిగా నిలకడగా రాణిస్తోంది. వివిధ కేటగిరీల్లో ఇప్పటి వరకు మొత్తం 18 సార్లు నేషనల్ కాంపిటీషన్లలో పాల్గొని పతకాలను సొంతం చేసుకుంది. అదే విధంగా ఉత్తమ క్యాచర్‌గా అవార్డులను దక్కించుకుందని తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి కె. శోభన్ బాబు తెలిపారు. ఆసియా క్రీడల్లో మమతా పాల్గొనడం ద్వారా తన సత్తా ఏంటో చాటేందుకు అవకాశం దక్కుతుందని చెప్పారు.