Home > జాతీయం > భారత మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ టెర్రరిస్టు హతం

భారత మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ టెర్రరిస్టు హతం

భారత మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ టెర్రరిస్టు హతం
X

ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్, గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్ అధిపతి, భారత మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (46)ను కెనడాలో ఆదివారం సాయంత్రం కాల్చి చంపారు. సర్రేలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్ దగ్గరున్న గురునానక్ సిక్కు గురుద్వారా దగ్గర గుర్తు తెలియని ఇద్దరు దుండగులు హర్దీప్ సింగ్ ను కాల్చి చంపారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ కొన్నేళ్లుగా.. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ సభ్యుల కార్యకలాపాలు చేయడం, నెట్వర్న్ ఏర్పాటుచేయడం, శిక్షణ, ఆర్థిక సాయం వంటివి చూసుకునేవాడు. దాంతో ఎన్ఐఏ హర్దీప్ సింగ్ పై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

ఇతనికి సిక్ ఫర్ జస్టిస్ సంస్థతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎన్ఐఏ హర్దీప్ సింగ్ ను అప్పగించాల్సిందిగా ఇప్పటికే కెనడా ప్రభుత్వాన్ని కోరింది. కానీ, ఇంతలోనే అతనిపై దాడి జరిగింది. కెనడాలోని భారత రాయబార సంస్థపై జరిగిన దాడుల్లో హర్దీప్ సింగ్ ప్రమేయం ఉంది. అతను సోషల్ మీడియాలో విద్వేష పూరిత ప్రసంగాలు, ఫొటోలు పెట్టి రెచ్చగొట్టేవాడు. పంజాబ్ లో కూడా హర్దీప్ పై చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే అతనిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయింది.




Updated : 19 Jun 2023 5:12 PM IST
Tags:    
Next Story
Share it
Top