భారతదేశంలోని అత్యంత వృద్ధ ఏనుగు మృతి..దీని వయసు ఎంతంటే ?
X
భారతదేశంలోని అత్యంత వృద్ధ ఏనుగు మృతి చెందింది. 89 ఏళ్ల బిజులీ ప్రసాద్ సోమవారం మరణించింది. అస్సాం సోనిత్ పుర్ జిల్లాలో తేయాకు తోటల్లో ఈ ఏనుగు జీవించేంది. ఏనుగు మృతికి వృద్ధాప్యసమస్యలే కారణమని తెలుస్తోంది. జంతుప్రేమికులు, స్థానికులు బిజులీ ప్రసాద్ మరణవార్త తెలుసుకుని నివాళులు అర్పిస్తున్నారు.
సాధారణంగా ఏనుగులు 60-70 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాయి. జూలో కొన్ని ఏనుగులు 85 సంవత్సరాలు జీవించిన సందర్భాలున్నాయి. కానీ బిజులీ ప్రసాద్ 89 సంవత్సరాలు జీవించి రికార్డు సృష్టించింది. ఇంగ్లండ్‌కు చెందిన ఆలివర్ సాహిబ్ ఈ ఏనుగుకు మొదటి మాస్టర్. ఈ ఏనుగుకు బిజులీ ప్రసాద్ అని పేరు పెట్టాడు. ఈ ఏనుగు పిల్లగా ఉన్నప్పుడు బెర్గాంగ్ టీ ఎస్టేట్‌లో ఉండేది. అక్కడి నుంచి ఏనుగు పిల్లను విలియమ్సన్ మగర్ గ్రూప్ టీ ఎస్టేట్‌కు తీసుకొచ్చారు. బెర్గాంగ్ టీ ఎస్టేట్ విక్రయించబడినందున, ఏనుగుకు మరొక టీ ఎస్టేట్‌లో వసతి కల్పించారు. పదేళ్ల క్రితమే దీని దంతాలు ఊడిపోయినప్పటికీ అధిక ప్రోటీన్ తో కూడిన ఆహారాన్ని దీనికి అందించే వారు. రోజుకు 25 కేజీల ఆహారం తినేదని ఎస్టేట్ నిర్వాహకులు వెల్లడించారు.