IndiGo : ముందు సీట్ కావాలా? అయితే రూ.2000వేలు కట్టాల్సిందే
X
ప్రముఖ దేశీయ విమాన సంస్థ ఇండిగో (IndiGo) ఎయిర్‌లైన్స్.. టికెట్ల ధరలను పెంచింది. ఎక్కువ లెగ్ స్పెస్ ఉండే ముందు సీట్లను ఎంపిక చేసుకుంటే ప్రయాణికులు రూ.2,000 వరకు ఎక్కువ గా చెల్లించాల్సి ఉంటుంది. అదే.. వరుసలో మధ్య సీటు ఎంచుకుంటే అదనంగా రూ.1,500 వెచ్చించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆ సంస్థ ఛార్జీలను సవరిస్తూ వైబ్‌సైట్‌లో పెంపు వివరాలను చెర్చింది. జనవరి 4న, ఇండిగో ఇంధన సర్‌ఛార్జ్‌ను తీసివేస్తున్నట్లు ప్రకటించింది.
ఇండిగో సంస్థ పొందుపరిచిన వివరాల ప్రకారం .. 232 సీట్ కేసాసీటి గల ఎయిర్‌బస్ A321 విమానంలో మెుదటి వరుసలో ఉండే విండో లేదా మధ్య సీటు (Aisle seat)ను ఎంచుకుంటే మాత్రం రూ.2,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే మధ్య సీటుకు రూ.1,500 వసూలు చేస్తారు. ఇక A321 - 222 కేసాసీటి గల ఎయిర్‌బస్, A320 విమానాలకూ ఇలాంటి ఛార్జీలే వర్తిస్తాయి. ATR విమానాల్లో మాత్రం సీటు ఆప్షన్ ఛార్జీ రూ.500 వరకు ఉంటుంది.
ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు పెరుగుతున్న కారణంగా, ఇండిగో ఛార్జీలను పెంచింది. దీనిపై ఇప్పటి వరకు ఇండిగో సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇండిగో సంస్థ రోజుకు 1900 కంటే ఎక్కువ విమానాలను నడుపుతోంది. వీటిలో 81 దేశీయ గమ్య స్థానాలు, 32 అంతర్జాతీయ గమ్య స్థానాలు ఉన్నాయి. భారతదేశంలో అత్యధిక మార్కెట్ వాటాను ఇండిగో విమాన సంస్థ కలిగి ఉంది. రెండో త్రైమాసికంలో ఇండిగో రూ. 188.9 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా రెండవ త్రైమాసికంలో ఏవియేషన్ కంపెనీ లాభాలను ఆర్జించడం 5 సంవత్సరాలలో ఇదే మొదటిసారి. సాధారణంగా ఈ త్రైమాసికం ఏవియేషన్ పరిశ్రమలో ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి..