Home > జాతీయం > Indigo Flight : ‘నా సీటు కింద బాంబు ఉంది’.. ఇండిగో విమానంలో కలకలం

Indigo Flight : ‘నా సీటు కింద బాంబు ఉంది’.. ఇండిగో విమానంలో కలకలం

Indigo Flight  : ‘నా సీటు కింద బాంబు ఉంది’.. ఇండిగో విమానంలో కలకలం
X

ఇండిగో ఎయిర్ లైన్స్.. సర్వీసులో లోపాలు సహా ప్రయాణికుల వింత చేష్టలతో నిత్యం వార్తల్లోకికెక్కుతుంది. తాజాగా ఓ ప్రయాణికుడు చేసిన పనితో మళ్లీ వార్తల్లో నిలిచింది. తన సీటు కింద బాంబు ఉందని ఓ ప్రయాణికుడు చెప్పడంతో విమానంలో కలకలం రేగింది. అర్ధరాత్రి ముంబై నుంచి లక్నో వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో విమానాన్ని క్షున్నంగా తనిఖీ చేశారు.

27ఏళ్ల వ్యక్తి ఈ విమానంలో ఎక్కాడు. అయితే అకస్మాతుగా తన సీటు కింద బాంబు ఉందంటూ కేకలు వేశారు. దీంతో ప్రయాణికులంతా భయాందోళన చెందారు. సిబ్బంది సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ విమానంలో తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో ఎటువంటి బాంబు లేదని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే బాంబు ఉందని చెప్పిన ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు అలా ఎందుకు చెప్పాడనే దానిపై విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో విమానం ఆలస్యంగా బయలుదేరింది.


Updated : 28 Jan 2024 2:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top