Home > జాతీయం > యుద్ధవీరుడికి ఇండిగో విమాన సిబ్బంది అపూర్వ స్వాగతం

యుద్ధవీరుడికి ఇండిగో విమాన సిబ్బంది అపూర్వ స్వాగతం

యుద్ధవీరుడికి ఇండిగో విమాన సిబ్బంది అపూర్వ స్వాగతం
X

వాళ్ళు ఉండబట్టే మనం ఉన్నాం. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశాన్ని కాపాడుతున్నా ఎంత గౌరవం ఇచ్చినా తక్కువే అవుతుంది. ఇదే పని చేసింది ఇండిగో విమాన సిబ్బంది. తన ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న కార్గిల్ యుద్ధవీరుడికి అత్యతం గౌరవంగా స్వాగతం పలికింది.

కార్గిల్ యుద్ధం...ఉన్నట్టుండి పాకిస్తాన్ మన దేశం మీదకి వచ్చేస్తే ప్రానాలకు తెగించి పోరాడింది భారత ఆర్మీసేన. శత్రుమూకను తరిమికొట్టింది. ఈ యుద్ధంలో ఎందరో జవాన్లు మృతి చెందారు. మరికొంతమంది ప్రాణాలకు తెగించి పోరాడి అజేయులుగా నిలిచారు. అలాంటివారిలో ఒకరే సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్. పరమవీరచక్క అవార్డును అందుకు ఈయన ఆదివారం పూణె విమానంలో ప్రయాణించారు. ఇది ముందుగానే గుర్తించి ఇండిగో విమాన సంస్థ ఆయనకు అపూర్వ స్వాగతం పలికింది. సంజయ్ వచ్చే ముందు స్పెషల్ అనౌన్స్ చేసింది. ఈరోజు మనతో పాటూ ప్రత్యేక వ్యక్తి ఉన్నారంటూ...ఆయన గురించి అందరికీ చెప్పారు సిబ్బంది. చిన్న బహుమతితో ఆయన్ని సత్కరించారు కూడా. సంజయ్ గురించి చెబుతున్నప్పుడు తోటి ప్రయాణికులు చప్పట్లుతో అభినందనలు తెలిపారు.

సుబేదార్‌ మేజర్‌ సంజయ్‌ కుమార్‌ దేశానికి అందించిన సేవలను కూడా కెప్టెన్‌ వివరించారు. 1999 జులై 4న జమ్మూకశ్మీర్‌ రైఫిల్స్‌ 13వ బెటాలియన్‌ సభ్యుడిగా ఉన్న సంజయ్‌ కుమార్‌ కార్గిల్‌ యుద్ధంలో తీవ్రంగా పోరాడారు. శత్రువుల దాడిలో ఆయన ఛాతీపై రెండు బులెట్లు దూసుకెళ్ళాయి. చేతిపైన కూడా గాయమైంది. అయినా ఆయన వెనకడుగు వేయలేదు. శరీరం నుంచి రక్తం ధారలై కారుతున్నా.. శత్రువుల బంకర్‌లోకి వెళ్ళి పాక్‌ సైనికులను చంపారు. ఈయనకు పరమవీరచక్ర అవార్డును అందించింది భారత ప్రభుత్వం. యుద్ధ వీరుల ధైర్యసాహసాలకు ఇచ్చే అత్యున్నత గ్యాలెంట్రీ అవార్డు ఇది. భారత చరిత్రలో ఇప్పటివరకు కేవలం 21 మంది మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారు.

ఈ వీడియోను ఇండిగో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. హీరోతో కలిసి విమనా ప్రయాణం అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ వీడియోను బోలెంతమంది లైక్ చేస్తున్నారు. మేజర్ సంజయ్ కు వందనాలు అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Updated : 24 July 2023 12:16 PM IST
Tags:    
Next Story
Share it
Top