బుద్ది లేని కుక్కలు కొట్లాడుకుంటే.. మెదడు లేని యజమాని చేసిన పని ఇదీ...
X
విచక్షణా జ్ఞానం లేని రెండు కుక్కలు కొట్లాడుకుంటే.. వాటి ఓనర్లు మాత్రం.. అదేదో పరువు విషయంగా భావించి గొడవ పడ్డారు. ఆ వివాదం కాస్త సీరియస్‌గా మారడంతో ఓ యజమాని తన వద్ద ఉన్న గన్‌తో మరో కుక్క ఓనర్‌ను కాల్చేశాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతిచెందగా, ఆరుగురు గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ దారుణం జరిగింది.
అసలేం జరిగిందంటే.. కృష్ణ భాగ్ కాలనీలో ఉండే రజావత్, విమల్ అచల .. అనే ఇద్దరూ ఇరుగుపొరుగు వాళ్లు. ఆ ఇద్దరూ రాత్రి 11 గంటల సమయంలో తమ కుక్కల్ని బయటకు తీసుకువెళ్లారు. వాకింగ్‌కు వెళ్లిన సమయంలో.. ఆ రెండు పెంపుడు కుక్కలు ఒకదానికొకటి చూసి అరుచుకున్నాయి.. రెండింటి మధ్య ఫైట్ మొదలవడంతో వాటి ఓనర్లు కూడా గొడవకు దిగారు. ఆ సమయంలో రజావత్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఇంట్లోకి వెళ్లి తన వద్ద ఉన్న 12-బోర్ గన్‌తో ఫైరింగ్ చేశాడు. తన ఇంటి బాల్కనీ నుంచే అతను కాల్పులు జరిపాడు.
రజావత్ కాల్పులు జరుపుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పై అంతస్తు నుంచి అతను కింద ఉన్న వ్యక్తుల్ని షూట్ చేశాడు. వీధుల్లో ఉన్న జనం అరుస్తున్నా.. రజావత్ తన గన్‌కు పనిపెట్టాడు. అతని కాల్పులకు అచలతో పాటు రాహుల్ వర్మ.. ఇద్దరూ వ్యక్తలు బలయ్యారు. గొడవ సమయంలో వీధిలో ఉన్న మరో ఆరుగురు కూడా గాయపడ్డారు. ఇద్దరికి గాయాలు తీవ్రంగా ఉన్నాయి. రజావత్, అతని కుమారుడిపై మర్డర్ కేసు నమోదు చేశారు. గ్వాలియర్‌కు చెందిన రజావత్‌ను ఓ ప్రైవేటు బ్యాంక్ ..సెక్యూరిటీ గార్డుగా విధుల్లో పెట్టుకున్నది. అతని వద్ద 12 బోర్ రైఫిల్ ఉండడం వల్లే అతనికి సెక్యూర్టీ గార్డు ఉద్యోగం ఇచ్చారు.