Home > జాతీయం > లివ్-ఇన్ రిలేషన్ షిప్.. ఓ టైమ్ పాస్ అగ్రిమెంట్.. హైకోర్టు వ్యాఖ్య

లివ్-ఇన్ రిలేషన్ షిప్.. ఓ టైమ్ పాస్ అగ్రిమెంట్.. హైకోర్టు వ్యాఖ్య

లివ్-ఇన్ రిలేషన్ షిప్.. ఓ టైమ్ పాస్ అగ్రిమెంట్.. హైకోర్టు వ్యాఖ్య
X

లైవ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న తనకు పోలీసు రక్షణ కల్పించాలంటూ ఓ యువతి చేసిన అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. అలాంటి సంబంధాలు ఎటువంటి స్థిరత్వం లేని "టైంపాస్"కు దారితీస్తాయని పేర్కొంది. లివ్-ఇన్ రిలేషన్.. అనేది కేవలం తాత్కాలికం మాత్రమే అని ఎక్కువ కాలం నిలిచి ఉండేది కాదని తెలిపింది. జీవితమనేది అనేక సంక్లిష్టతలతో కూడుకున్నదని, దానిని పూల పాన్పుగా పరిగణించరాదని కూడా చెప్పింది.

మధుర జిల్లాలోని రిఫైనరీ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన రాధిక అనే 22 ఏళ్ల యువతి.. ఇంటిని వదిలి సాహిల్ అనే యువకుడితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ ప్రారంభించింది. ఈ క్రమంలో ఆగస్టు 17న రాధిక కుటుంబ సభ్యులు సాహిల్‌పై ఐపీసీ సెక్షన్ 366 కింద కేసు పెట్టారు. పెళ్లి కోసం రాధికను కిడ్నాప్ చేశాడని, అతడి వల్ల ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాధిక.. తాము లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నామనీ, ఎఫ్ ఐఆర్ ను రద్దు చేయాలంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ ఇద్దరికీ ప్రాణహాని ఉందని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని మధుర పోలీసులను ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొంది.

ఈ పిటిషన్‌పై జస్టిస్‌ రాహుల్‌ చతుర్వేది, జస్టిస్‌ మహ్మద్‌ అజర్‌ హుస్సేన్‌ ఇద్రిసీ డివిజన్‌ ​​బెంచ్‌లో విచారణ జరిగింది. కోర్టులో విచారణ సందర్భంగా.. రాధిక , సాహిల్ ఇద్దరూ మేజర్లని, వారి ఇష్టానుసారం ఒకరితో ఒకరు లైవ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవిస్తున్నారని వాదించారు. దీంతో పాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇద్దరికీ కలిసి జీవించే హక్కు ఉందని, వారి జీవితాల్లో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను రాధిక కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. సాహిల్‌కు నేర చరిత్ర ఉందని, అతనిపై 2017లో మధురలోని ఛాటా పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైందని కోర్టుకు తెలిపారు. బాధితురాలి కుటుంబం తరపున, సాహిల్‌తో రాధిక భవిష్యత్తు అస్సలు సురక్షితం కాదని, అతను ఎప్పుడైనా ఆమె ప్రాణానికి ముప్పుగా మారవచ్చని చెప్పారు. ఈ కేసులో తీర్పును వెలువరిస్తూనే ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసి రాధిక, సాహిల్‌లకు భద్రత కల్పించాలన్న డిమాండ్‌ను హైకోర్టు అంగీకరించలేదని తెలిపింది. పైన చెప్పిన విషయాలన్నీ పేర్కొంటూ పిటిషన్‌ను తిరస్కరించింది.




Updated : 24 Oct 2023 8:59 AM IST
Tags:    
Next Story
Share it
Top