Home > జాతీయం > పోలీస్ వెహికల్‌పై యువతి పిచ్చి చేష్టలు

పోలీస్ వెహికల్‌పై యువతి పిచ్చి చేష్టలు

పోలీస్ వెహికల్‌పై యువతి పిచ్చి చేష్టలు
X

బాధ్యతాయుతమైన పోలీసు వృత్తిలో ఉన్నప్పుడు.. అంతే బాధ్యతగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వ ఆస్తులను, వాహనాలను కాపాడాలి. అలా కాకుండా వాటిని సొంత ఆస్తిగా భావించి.. అన్యులకు, అమ్మాయిలకు అవకాశమిస్తే ఓ అధికారికి పట్టిన గతే అందరికీ పట్టుద్ది. ఓ ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్‌తో ఎలాంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయో తెలియదు కానీ.. ఆ పోలీసు అధికారి .. సదరు మహిళా ఇన్ ఫ్లుయెన్సర్‌కి .. పోలీసు వాహనం బానెట్ పై కూర్చొనే చనువు ఇచ్చాడు. దొరికిందా కదా అని ఆమె దానిపై కూర్చొని రీల్ చేసింది. ఆ రీల్ కాస్త వైరల్ అయి.. పోలీసు ఉన్నతాధికారులకు చేరింది. దీంతో పోలీసు వాహనంతో రీల్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చిన ఆ అధికారిని సస్పెండ్ చేశారు.





పంజాబ్ కు చెందిన ఓ ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్.. జలంధర్ పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీస్ వాహనాన్ని రీల్స్ చేసేందుకు వాడుకుంది. పోలీసు వాహనం బానెట్ పై కూర్చొని పాపులర్ పంజాబీ సాంగ్‌కు డ్యాన్స్ స్టెప్పులు వేసింది. అంతేకాదు.. దానిపై కూర్చొని అనుచిత, అసభ్యకరమైన హావభావాలను ప్రదర్శిస్తూ.. పిచ్చి వేషాలు వేసింది. ఆమె రీల్ లో భాగంగా తన మధ్య వేలిని చూపిస్తూ కనిపించింది.వీడియో చివర్లో మహిళతో పాటు పోలీస్ యూనిఫాంలో ఉన్న వ్యక్తి కూడా కనిపించారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పక్కనే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు.. మనకేం కాదులే అన్న ధీమాతో ఒళ్లు మరిచి పిచ్చి సైగలు చేయడం చూసి నెటిజన్లు కూడా.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ వీడియో కాస్త పోలీసు ఉన్నతాధికారుల దగ్గరికి చేరడంతో.. యువతికి అలా రీల్స్ చేసుకోవడానికి పోలీసు వాహనాన్ని ఇచ్చిన జలంధర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశోక్ శర్మపై సస్పెన్షన్ వేటు పడింది. జలంధర్ పోలీస్ కమిషనర్ కుల్దీప్ చాహల్.. ఈ సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేశారు. ఆ వెంటనే ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు.




Updated : 29 Sept 2023 2:19 PM IST
Tags:    
Next Story
Share it
Top