‘నన్నే డబ్బులు అడుగుతావా.. షాపు ఎలా తెరుస్తావో చూస్తా’ స్వీట్ షాపులో పోలీస్ ఓవరాక్షన్
X
సామాన్యులపై పోలీసు జులుం మామూలే. వీధి వ్యాపారులు, చిన్న షాప్ యజమానులపై ప్రతాపం చూపిస్తుంటారు. అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో సర్వేంద్ర కుమార్ అనే ఎస్సై.. స్వీట్ షాపు యజమానితో గొడవపడ్డాడు. బిల్లు కట్టమని అడిగినందుకు రచ్చ చేసి.. అతన్ని బెదిరించాడు. వివరాల్లోకి వెళ్తే.. కల్యాణ్ పూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్సై సర్వేంద్ర కుమార్ మద్యం మత్తులో ఓ స్వీట్ షాపుకు వెళ్లాడు. అక్కడ రూ. 110 విలువగల స్వీట్స్ కొనుక్కొని వెళ్తుంటాడు.
అంతలో షాపు యజమాని.. సార్ డబ్బులు పే చేయండని అన్నాడు. ఆ మాటతో కోపంతో ఊగిపోయిన పోలీస్.. యజమానితో గొడవకు దిగుతాడు. బూతులు తిడుతూ.. ‘నన్నే డబ్బులు అడుగుతావా. రేపటి నుంచి షాప్ ఎలా నడుపుతావో చూస్తా. నేనేంటో చూపిస్తానంటూ’ వర్నింగ్ ఇచ్చాడు. అదంతా అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియోలో పోస్ట్ చేసి.. పోలీస్ అధికారులను ట్యాగ్ చేశాడు. అంతే.. ఎస్సై చేసిన నిర్వాకం అంతా బయపడింది. సర్వేంద్ర కుమార్ ను సస్పెండ్ చేసి.. కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని కోరారు పోలీస్ అధికారులు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఎస్సై సర్వేంద్ర కుమార్ పై మండి పడుతున్నారు. అధికారం ఉందని, సామాన్య ప్రజలపై జలుం చూపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
कानपुर के कल्याणपुर में पनकी रोड पर एक दुकान में दरोगा का आतंक। आरोप, मिठाई खरीदकर पैसे नहीं दे रहा था। पैसे मांगने पर क्या किया, वो विडियो में दिख रहा है।
— Praveen Mohta (@MohtaPraveenn) June 18, 2023
CCTV और स्मार्ट फोन सही समय पर आ गए, वरना आम आदमी का दर्द कभी दिख न पाता। #Kanpur #UPPolice @NBTLucknow pic.twitter.com/Y3i83VNlKL