Baryl Vanneihsangi : కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ యాంకర్ ఎవరో తెలుసా?
X
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పీఎం) ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. మొత్తం 40 స్థానాలున్న మిజోరాంలో ఆ కూటమికి 27 సీట్లు దక్కాయి. ఆ పార్టీ నుంచి గెలిచిన బారిల్ వన్నెహ్సాంగి అనే మహిళ.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. మిజోరంలో కేవలం 32 ఏళ్ల వయస్సులో ఎమ్మెల్యేగా ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా ఆమె రికార్డు సృష్టించారు.
బారిల్ వన్నెహ్సాంగి గతంలో రేడియో జాకీ గా, టీవీ యాంకర్ గా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయంలోకి అడుగుపెట్టి ZPM అభ్యర్థిగా... ఐజ్వాల్ సౌత్-III స్థానానికి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బారిల్.. మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) అభ్యర్ధి ఎఫ్ లాల్నున్మావియా ఓడించి మొత్తం 1,414 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. వన్నెసంగికి మొత్తం 9,370 ఓట్లు రాగా, ఆమె ప్రత్యర్థి అయిన లాల్నున్మావియాకి 7,956 ఓట్లు వచ్చాయి.
బారిల్ వన్నెహ్సాంగి గతంలో ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC)లో కార్పొరేటర్‌గా పనిచేశారు. మేఘాలయలోని షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌ను పూర్తి చేశారు. గతంలో టెలివిజన్ యాంకర్‌గా కూడా పనిచేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 253 వేల వన్నెహ్సాంగికి ఫాలోవర్లు ఉన్నారు. మిజోరాం ఫలితాల తర్వాత ఆమె లింగ సమానత్వం గురించి గట్టిగా మాట్లాడారు. మహిళలు తమ అభిరుచి అనుగుణంగా ముందుకెళ్లాలని సూచించారు. వ్యవస్థను మార్చడానికి తనకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వారి అంచనాలకు అనుగుణంగా ముందుకు సాగుతానని చెప్పారు.