independence day 2023 : భారత్‌లో హై అలర్ట్..ఉగ్రదాడులకు ప్లాన్..
X
దేశ రాజధాని ఢిల్లీ హై అలర్ట్ అయ్యింది. స్వాతంత్య్ర వేడుకల్లో ఉగ్రదాడులు జరుగుతాయనే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్తో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ఢిల్లీలోని ప్రధాన రైల్వే స్టేషన్లు, రహదారులే టార్గెట్‌గా అటాక్ చేయనున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందించడంతో సర్కార్ అప్రమత్తమైంది. అన్ని రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడల్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. లష్కరే-ఈ-తోయిబా, జైషే-ఈ-మహ్మద్‌కు చెందిన టెర్రరిస్టులు దాడులకు ప్లాన్ చేశారని నిఘా బృందాలు తెలిపాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశంలో భద్రతా వైఫల్యాన్ని సృష్టించాలని ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరిలోనే ఢిల్లీలో ఉగ్రదాడులు జరగనున్నాయని నిఘా వర్గాలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నగరంలోని రద్దీ ప్రాంతాలనే వారు టార్గెట్ చేశారని ఇంటెలిజెన్స్‌కు తెలిసింది. నేషనల్ ఇన్వెష్టిగేటివ్ ఏజెన్సీ సెంటర్‌పై అటాక్ చేసి భద్రతా వైఫల్యాన్ని సృష్టించాలని కుట్ర చేస్తున్నట్లు నిఘా వర్గాలకు తెలిసింది. దీంతో అధికారులు సెక్యూరిటీని హై అలర్ట్ చేశారు. ఎక్కడిక్కడ పెట్రోలింగ్ వ్యవస్థలను పెంచారు. ఢిల్లీలోని రహదారులలో తిరిగే వాహనాలన్నింటినీ సెర్చ్ చేస్తున్నారు. స్వాంతత్ర్య దినోత్సవ వేడుకలు సాఫీగా సాగేందుకు దాదాపు 10,వేల మంది పోలీసులను మోహరించారు. 1000 ఫేస్ రికగ్నీషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎర్రకోట పరిసరాల్లో యాంటీ డ్రోన్ సిస్టమ్, సర్వెలెన్స్‌ను పెంచారు.