Home > జాతీయం > ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు రూ.30 వేల జీతం

ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు రూ.30 వేల జీతం

ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు రూ.30 వేల జీతం
X

బ్యాంకు జాబ్స్ కోసం ఎదురుచూసే అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. ఐపీపీబీ-ఇండియన్ పోస్ట్​ పేమెంట్స్ బ్యాంకు(IPPB Recruitment 2023)లో ఎగ్జిక్యూటివ్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల అయింది. మొత్తం 132 ఎగ్జిక్యూటివ్​ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఐపీపీబీ. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 16 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు బీఈ, బీటెక్‌, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం క‌లిగి ఉండాలి. ఆన్‌లైన్ టెస్టు, గ్రూప్ డిస్క‌ష‌న్, ప‌ర్స‌న‌ల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది.

మొత్తం పోస్టులు : 132 (ఎగ్జిక్యూటివ్​ పోస్టులు)





విద్యార్హతలు : గుర్తింపు పొందిన కళాశాల లేదా యునివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పట్టా పొందిన అభ్యర్థులు అర్హులు.

ఏజ్​ లిమిట్​ : 2023 జూన్​ 1 నాటికి 21 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి.

వేతనం : నెలకు రూ.30,000.

పరీక్ష తేదీ : www.ippbonline.com వెబ్​సైట్​లో త్వరలోనే పరీక్ష తేదీని ప్రకటిస్తారు.

అప్లికేషన్ ఫీజు.. : ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు- రూ.100/-ఓసీ, బీసీ ఇతర కేటగిరీలకు- రూ.300/-

సెలక్షన్ ప్రొసెస్ : రాతపరీక్ష (ఆన్​లైన్​)గ్రూప్​ డిస్కష్షన్​ పర్సనల్​ ఇంటర్వ్యూ

జాబ్​ లొకేషన్.. : ఆయా ఎంపిక చేసిన నగరాల్లో

దరఖాస్తు చివరితేదీ. : 2023 ఆగస్టు 16. అప్లికేషన్​ ఫారమ్​ను ప్రింట్ అవుట్​ తీసుకోవడానికి​ చివరితేదీ ఆగస్టు 31.




Updated : 30 July 2023 12:08 PM IST
Tags:    
Next Story
Share it
Top