భక్తులకు బంపర్ ఆఫర్...రూ.14వేలకే పుణ్యక్షేత్రాల దర్శనం
X
దక్షిణ తమిళనాడులోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే వారికి ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్యాకేజీ ఊరిస్తోంది. తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను అతి తక్కువ ఖర్చుతోనే దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది. ‘దివ్య దర్శన యాత్ర’ టూర్ ప్యాకేజీ పేరుతో అరుణాచలం, శ్రీ రంగనాథస్వామి ఆలయం, మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయంతో పాటు మరిన్ని పుణ్యక్షఏత్రాలను సందర్శించేందుకు వీలుగా 8 రోజుల పాటు టూర్‌ను ప్లాన్ చేసింది.
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ పేరిట ఆగస్టు 9 నుంచి ఈ యాత్రను ప్రారంభించనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రైలు రాకపోకలను కొనసాగిస్తుంది. సికింద్రాబాద్ మొదలు, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలోనూ భక్తులు ఈ రైలు ఎక్కొ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. అంతే కాదు టూర్ పూర్తైన అనంతరం వారి వారి రైల్వే స్టేషన్లలో దిగే వెసులుబాటు ఉంది. ఈ టూర్ మొత్తాన్ని ఎనిమిది రాత్రులు తొమ్మిది పగళ్లు ఉంటుంది. టూటైర్ ఏసీ, త్రీటైర్ ఏసీ, స్లీపర్ క్లాసుల్లో వారి వారి స్థోమతను బట్టి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైలు మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరుతుంది. అలా బయల్దేరిన రైలు 48 గంటల్లో తిరువణ్ణామలై చేరుకుంటుంది. అక్కడ భక్తులు అరుణాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరిగి రైల్వేస్టేషన్‌కు వచ్చి మధురై ఆలయానికి బయల్దేరుతారు. మూడో రోజు ఉదయం 8 గంటలకు మధురై చేరుకుని పూజలు చేసుకుంటారు. అక్కడ నుంచి బస్సులో రామేశ్వరం , తో పాటు చుట్టుపక్కన ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. అయితే వీటి ఖర్చులను మాత్రం యాత్రికులే భరించాలి. హోటల్‌లో ఆ రోజు రాత్రి అక్కడే బస చేయాలి. నాలుగో రోజు రామేశ్వరం దర్శనం చేసుకుని ఆ తరువాత మధురైకు ప్రయాణమవుతారు. ఆ రోజు సాయంత్రం మీనాక్షి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం రైల్వే స్టేషన్‌కు చేరుకొని కన్యాకుమారికి బయల్దేరుతారు. ఐదో రోజు కన్యాకుమారిలోని ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. ఆరో రోజు తిరువనంతపురం చేరుకుని అనంత పద్మనాభస్వామిని దర్శించుకుంటారు. ఏడో రోజు శ్రీ రంగనాథస్వామి ఆలయం , తంజావూరులోని బృహదీశ్వర దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఈ రోజుతో యాత్ర పూర్తవుతుంది. అనంతరం సికింద్రాబాద్ రైలు ఎక్కి తొమ్మిదో రోజు ఉదయం 2:30 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంటారు.