Home > జాతీయం > వర్షాలు కురవట్లేదు.. చంద్రయాన్​ 3 నే కారణం?

వర్షాలు కురవట్లేదు.. చంద్రయాన్​ 3 నే కారణం?

వర్షాలు కురవట్లేదు.. చంద్రయాన్​ 3 నే కారణం?
X

దేశంలో వర్షాలు సరిగ్గా కురవకపోవడానికి.. అందుకు చంద్రయాన్​ 3 ప్రయోగమే కారణమా? అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు బిహార్​కు చెందిన రాజ్‌కుమార్ ఝా అనబడే సోషల్ యాక్టివిస్ట్ . ఈ మేరకు సమాధానం చెప్పాలంటూ.. కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖకు ఆర్టీఐ అప్లై చేశారు. సమాధానం కోసం భగవంతుడి నుంచి సలహా కూడా తీసుకోవచ్చని ప్రభుత్వానికి సూచించారు. సరైన సమయంలో వర్షాలు ఎందుకు పడటం లేదని దేవుడ్ని అడగాలని చెప్పారు.





చంద్రయాన్​ ప్రయోగంలోని లూనార్​ మిషన్​లో కొత్త పరికరాలు అమర్చారని.. అందుకే వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించాయన్నారు రాజ్‌కుమార్. ఈ సీజన్​లో విపరీతమైన వానలు కురవాలని, కానీ వాతావరణం చాలా వేడిగా ఉండి.. వర్షాలే రావడం లేదని దరఖాస్తులో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్న రాజ్​కుమార్​.. అందువల్ల ప్రజలంతా చాలా అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. "చంద్రయాన్ 3 మిషన్​ చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్​ అయింది. ఇదే వాతావరణాన్ని ట్యాంపరింగ్​ చేసినట్లు నేను భావిస్తున్నాను. వాతావరణ పరిస్థితులు ఎందుకిలా మారుతున్నాయి. నాకు ప్రభుత్వం నుంచి సమాధానం కావాలి. అందుకోసం భగవంతుడి నుంచి కూడా ప్రభుత్వం సలహా తీసుకోవచ్చు." అని దరఖాస్తులో తెలిపారు​. చంద్రయాన్ 3 మిషన్​లోని ప్రజ్ఞాన్​ రోవర్​కు స్వర్గం నుంచి సిగ్నల్స్ అందుతాయన్నారు​. వాతావరణ పరిస్థితులు ఇలా మారడానికి గల కారణాలను అర్థం చేసుకునేందుకు అది సాయం చేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీఐ కార్యకర్త దాఖలు చేసిన దరఖాస్తు చర్చనీయాంశంగా మారింది.







Updated : 8 Sept 2023 12:49 PM IST
Tags:    
Next Story
Share it
Top