సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకులు కన్ఫార్మ్?
X
భారత టెన్నీస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ లు విడిపోయారంటూ ఏడాదిగా ప్రచారం జరుగుతోంది. అయితే దీన్ని కొన్నాళ్ళు వీరిద్దరూ పట్టించుకోలేదు. ఒకటి, రెండు సార్లు అలాంటిదేమీ లేదని చెప్పారు. కానీ ఇప్పుడు షోయబ్ పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్ లో మళ్ళీ ఈ వ్యవహారం తెరమీదకు వచ్చింది.
సానియా, షోయబ్ లు ఇద్దరూ ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గానే ఉంటారు. తాజాగా షోయబ్ తన బయోను మార్చాడు. ఇది వరకు సూపర్ ఉమన్ సానియా మీర్జా అని ఉండేది...ఇప్పుడు ప్రో అథ్లెట్-లైవ్ అన్ బ్రోకెన్ అని ఉంది. అలాగే ఓ బిడ్డకు తండ్రిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది కూడా పెట్టుకున్నాడు. బయోను మార్చడం, అందులో నుంచి సానియా పేరును తీసేయడంతో వాళ్ళిద్దరూ విడిపోయారని అనుకుంటున్నారు నెటిజన్లు. విడాకులు తీసుకోవడం ఖాయం అని అందుకే షోయబ్ బయోను మార్చాడని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. దానికి తోడు వీళ్ళిద్దరూ ఏడాది నుంచి విడివిడిగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంత చర్చ జరుగుతున్న ఇటు మాలిక్ కానీ, అటు సానియా కానీ దీని మీద స్పందించలేదు.
ఒక ఏడాది నుంచి సానియా-షోయబ్ లు సరిగ్గా ఉండటం లేదని ప్రచారం జరుగుతోంది. దానికి కారణం అతను పాకిస్తానీ నటి ఆయేషా ఉమర్ తో ఎఫైర్ నడపటమే అని తెలుస్తోంది. భర్త ఇలా మోసం చేయడం తట్టుకోలేకనే సానియా విడాకులు తీసుకోవాలని అనుకుంటోందని సమాచారం. అయితే వీరిద్దరూ కలిసి ది మీర్జా మాలిక్ షో చేస్తున్నారు. ఇప్పుడు విడాకులు తీసుకుంటే అది ఆగిపోతుంది. అందుకే ఇప్పటివరకు తీసుకోలేదని చెబుతున్నారు. కానీ ప్రస్తుతం విడవిడిగా ఉంటున్నారని అంటున్నారు.
సానియా మీర్జా-షోయబ్ మాలిక్ లకు 201లో వివాహం అయింది. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు.