మరో వివాదంలో రాహుల్ గాంధీ
X
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకోనున్నారా అంటే బీజెపీ ఎంపీలు అవుననే చెబుతున్నారు. రాముల్ తనను చూసి ప్లయింగ్ కిస్ ఇచ్చారని మంత్రి స్మృతీ ఇరానీ ఆరోపించారు.
ఈరోజు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం మీద మాట్లాడిన తరువాత వెళ్ళిపోతూ రాహుల్, స్మృతి ఇరానీని చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని సృతీ ఇరానీ చెబుతున్నారు. స్త్రీ ద్వేషులుమాత్రమే ఇలా తమ స్థానాల్లో కూర్చున్న మహిళా ఎంపీలను చూసి ఇలాంటి పనులు చేస్తారేమో అంటూ వ్యాఖ్యలు చేశారు. తన పనుల ద్వారా ఆయన అగౌరవంగా ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇష్యూ స్పీకర్ వరకూ వెళ్ళింది. బీజెపీ మహిళా ఎంపీలు, మంత్రులు ఈ విషయాన్ని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు సీసీటీవీ ఫుటేజి పరిశీలిస్తున్నారు. పార్లమెంటులో ఈరోజు రాహుల్ గాంధీ అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా బీజెపీ సర్కారు మీద విరుచకుపడ్డారు. దీనికి కౌంటర్ గా స్మృతి ఇరానీ కూడా ఆవేశంగా మాట్లాడారు.