Home > జాతీయం > ఇస్రో ఛైర్మన్కు అపూర్వ గౌరవం

ఇస్రో ఛైర్మన్కు అపూర్వ గౌరవం

ఇస్రో ఛైర్మన్కు అపూర్వ గౌరవం
X

చంద్రయాన్-3 సక్సెస్ అయింది. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్ నిలిచింది. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షను నెరవేస్తూ ఆగస్ట్ 23న ఇస్రో చరిత్ర సృష్టించింది. కాగా ఇస్రో సైంటిస్ట్ లను ముందుకు నడిపించి ప్రయోగం సక్సెస్ అయ్యేందుకు కీలక పాత్ర పోషించిన ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ను ప్రపంచం కొనియాడింది. ఈ క్రమంలో ఆయనకు ఇండిగో ఎయిలైన్స్ సిబ్భంది నుంచి అపూర్వ స్వాగతం లభించింది. తాజాగా ఇండిగో ఫ్లైట్ లో ప్రయాణించారు.

టేకాఫ్ కు ముందు ఆయనను విమాన సిబ్భంది ఆయనను గౌరవిస్తూ ప్రత్యేక అనౌన్స్ మెంట్ చేశారు. ‘ఈ విమానంలో మనతో పాటు ఓ ప్రత్యేక వ్యక్తి కూడా ఉన్నారు. ఆయతో ప్రయాణం ఎంతో సంతోషంగా ఉంది. మీకు మా సేవలందించడం ఎంతో గర్వకారణం. దేశం గర్వించేలా చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ చప్పట్లతో స్వాగతం పలికారు. తర్వాత ఎయిర్ హోస్టెస్ ఆయనకు ఫుడ్ ట్రేతో పాటు ఓ గ్రీటింగ్ కార్డ్ ను అందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Updated : 31 Aug 2023 10:39 PM IST
Tags:    
Next Story
Share it
Top