Home > జాతీయం > Chandrayaan-3: భద్రకాళి గుడిలో ఇస్రో ఛైర్మన్ ప్రత్యేక పూజలు

Chandrayaan-3: భద్రకాళి గుడిలో ఇస్రో ఛైర్మన్ ప్రత్యేక పూజలు

Chandrayaan-3: భద్రకాళి గుడిలో ఇస్రో ఛైర్మన్ ప్రత్యేక పూజలు
X

చంద్రయాన్-3 విజయవంతం అయింది. దక్షిన ధృవంలో మన రోవర్, ల్యాండర్లు అడుగుపెట్టాయి. ఈ విజయంపై దేశం మొత్తం గర్విస్తోంది. కొన్ని దేశాలు మనపై కల్లుకుంటుంటే.. ఇంకొన్ని దేశాలు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. ఈ క్రమంలో చంద్రయాన్-3 సాధించిన విజయానికి గానూ.. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తిరువనంతపురంలోని పౌర్ణమికవు- భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపించారు. అమ్మవారిని ప్రార్థించి తమ తదుపరి ప్రాజెక్టులు సక్సెస్ కావాలని కోరుకున్నారు. ఈ సంద్భంగా మాట్లాడిన సోమనాథ్ ‘చంద్రుడు, అంగారకుడు, శుక్ర గ్రహాలపైకి ప్రయాణించగల సత్తా మన ఇస్రోకు ఉంది. అంతరిక్షరంగం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఈ అభివృద్ధి దేశ అభివృద్ధికి తోర్పడుతుంది. అదే మా లక్ష్యం కూడా’అని అన్నారు. విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తి పాయింట్ గా పేరు పెట్టిన విషయం తెలిసిందే.



Updated : 27 Aug 2023 5:45 PM IST
Tags:    
Next Story
Share it
Top