Home > టెక్నాలజీ > Aditya-L1 : ఆదిత్య ఎల్ 1 తొలి విన్యాసం సక్సెస్.. ఇప్పుడు ఎక్కడుందంటే.

Aditya-L1 : ఆదిత్య ఎల్ 1 తొలి విన్యాసం సక్సెస్.. ఇప్పుడు ఎక్కడుందంటే.

Aditya-L1  : ఆదిత్య ఎల్ 1 తొలి విన్యాసం సక్సెస్.. ఇప్పుడు ఎక్కడుందంటే.
X

సూర్యుడిపై పరిశోధన కోసం ప్రయోగించిన భారత తొలి సోలార్ మిషన్ ‘ఆదిత్య-ఎల్‌ 1 (Aditya-L1)’ ప్రయాణం సజావుగా సాగుతోంది. భూకక్ష్యలోకి వెళ్లిన ఆదిత్య కక్ష్యను ఆదివారం విజయవంతంగా పెంచారు. ఉపగ్రహం ప్రస్తుతం 245× 22,459 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి వెళ్లినట్లు ఇస్రో తెలిపింది. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ కంట్రోల్ రూమ్ నుంచి కక్ష్యను పంచారు. ఈ నెల 5న వేకువజామున 3 గంటలను కక్ష్యను మరోసారి పెంచుతామని ఇస్రో తెలిపింది. 125 రోజుల్లో 145 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్న ఆదిత్య ఎల్ 1న లాగ్రాంజ్ 1 పాయింట్‌లో ప్రవేశపెట్టి భానుడిని అధ్యయనం చేస్తారు.

శనివారం శ్రీహరికోట నుంచి పీస్‌ఎల్‌వీ-సి57 రాకెట్ ద్వారా నింగికెగసిన ఈ ఉపగ్రహం 63 నిమిషాలు ప్రయాణించి నిర్దేశిత భూ కక్ష్యలోకి వెళ్లింది. 16 రోజులు భూకక్ష్యల్లో తిరిగిన తర్వాత భూమికి 15 లక్షల కి.మీ. దూరంలోఎల్‌1 బిందువువైపు ప్రయాణిస్తుంది. 1480 కేజీల బరువున్న ఆదిత్య ఎల్ 1లో ఏడు పరిశోధన పరికరాలను పంపారు. సూర్యుడి పైపొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్‌లలో సంభవించే సౌర తుపాన్లను, జ్వాలను, రేణువులను ఇది పరిశీలిస్తుంది. చంద్రయాన్ 3 ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఇస్రో 2008లో పురుడుపోసుకున్న ఆదిత్య ప్రాజెక్టును ఉత్సాహంతో చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సాంకేతిక సాయం అందిస్తోంది.

Updated : 3 Sep 2023 10:36 AM GMT
Tags:    
Next Story
Share it
Top