Home > జాతీయం > ISRO : ఇస్రో ప్రయోగం విజయవంతం.. నింగిలోకి GSLVF-14 రాకెట్..

ISRO : ఇస్రో ప్రయోగం విజయవంతం.. నింగిలోకి GSLVF-14 రాకెట్..

ISRO : ఇస్రో ప్రయోగం విజయవంతం.. నింగిలోకి GSLVF-14 రాకెట్..
X

ఇస్రో చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. GSLVF-14 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఇన్ శాట్ 3DS ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీఎఫ్-14 రాకెట్ విజయవంతంగా కక్షలోకి చేర్చింది. 27.30 గంటల కౌంట్ డౌన్ తర్వాత రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరి కోటలోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి దీనిని ప్రయోగించారు. ఇన్ శాట్ 3D, ఇన్ శాట్ 3DR లకు కొనసాగింపుగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. జియోసింక్రనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లో ఈ శాటిలైట్ను ఇస్రో విజయవంతంగా ప్రవేశపెట్టింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఇన్ శాట్ 3DS ఉపగ్రహం బరువు 2275 కిలోలు. ఈ ఉపగ్రహం పదేళ్లపాటు సేవలు అందించనుంది. ఈ శాటిలైట్ వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు పసిగట్టనుంది. భూమి, సముద్ర ఉపరితల మార్పులపై అధ్యయనం చేయనుంది. విపత్తులపై ముందే హెచ్చరించనుంది.

Updated : 17 Feb 2024 6:06 PM IST
Tags:    
Next Story
Share it
Top