Home > జాతీయం > ITC Limited : ఒక్క బిస్కెట్‌తో రోజుకు రూ.29 లక్షల మోసం

ITC Limited : ఒక్క బిస్కెట్‌తో రోజుకు రూ.29 లక్షల మోసం

ITC Limited : ఒక్క బిస్కెట్‌తో రోజుకు రూ.29 లక్షల మోసం
X

మీరెప్పుడైనా బిస్కట్ ప్యాకెట్ కొన్నప్పుడు.. ప్యాకెట్ ‌పైనున్న వివరాలు ఎప్పుడైనా గమనించారా? ఆ వివరాలతో లోపలున్న బిస్కట్‌ల సంఖ్యను పోల్చారా?. ఆ... ఆకలితో ఉన్నప్పుడు అలాంటివేం పట్టించుకుంటాం.. తిని ఆకలి తీసుకోవాలి కానీ.. రూ. 20 ల బిస్కట్ కోసం ఇంత సీన్ అవసరమా అని అనుకుంటే మాత్రం మీరు తప్పులో కాలేసినట్లే. అయితే అదే తప్పు చెన్నైకి చెందిన ఓ వ్యక్తి చేయలేదు. వీధి కుక్కల ఆకలి తీర్చేందుకు రెండు డజన్ల సన్ ఫీస్ట్ వారి మ్యారీ లైట్ బిస్కెట్ ప్యాకెట్స్ కొనుగోలు చేశాడు. అందులో ప్యాకెట్ విప్పి చూడగా అందులో ఒక బిస్కెట్ తక్కువగా ఉంది.ప్యాకెట్‌పై 16 బిస్కెట్లు అని రాసుండగా లోపల మాత్రం 15 వచ్చాయి. మిగతా ప్యాకెట్స్‌ను కూడా చెక్ చేయగా.. అందులో కూడా ఒక బిస్కట్ తక్కువగా ఉంది. ఇదేంటని దుకాణం దగ్గరకి వెళ్లి అడిగితే.. అక్కడ సరైన సమాధానం రాలేదు. దీంతో నేరుగా ఐటీసీ (ITC) కంపెనీని సంప్రదించాడు. అక్కడి నుంచి కూడా ఎలాంటి సరైన సమాధానం రాలేదు. దీంతో అతను వినియోగదారుల వ్యవహారాల విభాగానికి ఫిర్యాదు చేశాడు. ఇది జరిగి రెండేళ్లు పూర్తయింది. చెన్నైలోని ఎంఎండీఏ మాథుర్‌కు చెందిన పీ డిల్లిబాబు 2021, డిసెంబర్‌లో ఈ బిస్కెట్ ప్యాకెట్లను కొన్నాడు. .



వినియోగదారుల ఫోరానికి ఇచ్చిన ఫిర్యాదులో కంపెనీ ఏ విధంగా ప్రజలను మోసం చేస్తుందో వివరించాడు డిల్లీబాబు. ఒక బిస్కెట్ తయారీకి అయ్యే ఖర్చు 75 పైసలుగా అంచనా వేసాడు. దీని ప్రకారం కంపెనీ రోజుకు 50 లక్షల బిస్కెట్లు తయారు చేస్తుందనుకుంటే ప్యాకెట్లో ఒక బిస్కెట్ తక్కువగా ఇవ్వడం ద్వారా ఏకంగా రోజుకు రూ.29 లక్షలు ఆదా చేస్తోంది. లెక్కల ప్రకారం కంపెనీ ప్రజలను రూ. 29 లక్షలకు పైగా మోసం చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంటే ప్రభుత్వానికి ఆ రూ.29 లక్షలు ఖర్చు అయినట్లు చూపించి ప్రజల నుంచి ఆ సొమ్మును దోచుకుంటోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కంపెనీ సైతం కోర్టులో సమాధానం ఇచ్చింది. బిస్కెట్ల సంఖ్య బట్టి కాదని, వాటి బరువును బట్టి ప్యాకింగ్ ఉంటుందని తెలిపింది. దీంతో 15 బిస్కెట్లను తూకం వేయగా అవి 74 గ్రాములు ఉన్నాయి. కానీ ప్యాకెట్‌పై కంపెనీ 76 గ్రాములుగా పేర్కొంది. దీంతో కంపెనీ సమాధానం కూడా వీగిపోయింది. విచారించిన కన్జ్యూమర్ కోర్టు కంపెనీకి రూ.1 లక్ష జరిమానా విధించింది. డిల్లీబాబుకు నష్టపరిహారంగా ఆ లక్ష రూపాయలు చెల్లించడమే కాకుండా, తక్కువ బిస్కెట్లు ప్యాకింగ్ చేసిన వాటి విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించింది.












Updated : 6 Sep 2023 9:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top