Home > జాతీయం > J Jayalalitha : మళ్లీ చెప్తున్నా.. 'మా అమ్మ జయలలిత, మా నాన్న శోభన్ బాబు..'

J Jayalalitha : మళ్లీ చెప్తున్నా.. 'మా అమ్మ జయలలిత, మా నాన్న శోభన్ బాబు..'

J Jayalalitha : మళ్లీ చెప్తున్నా.. మా అమ్మ జయలలిత, మా నాన్న శోభన్ బాబు..
X

మా అమ్మ జయలలిత(Jayalalithaa) కోరిక తీర్చేందుకు కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెబుతున్నారు తనకు తాను జయలలిత కుమార్తెగా చెప్పుకుంటున్న జె.జయలక్ష్మి అనే మహిళ. జయలలితకు అసలైన కుమార్తెను తానేనని, ఇందుకోసం అవసరమైతే డీఎన్‌ఏ పరీక్షకు కూడా తాను సిద్ధమేనంటున్నారు. జయ మృతి చెందిన కొత్తలో ఆమె అసలు సంతానం తానేనంటూ మీడియాకు ముందుకు వచ్చిన జయలక్ష్మి.. మళ్లీ ఇన్నాళ్ల తరువాత శుక్రవారం దిండుగల్‌ జిల్లా కొడైకెనాల్‌(Kodaikanal)లో మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. ఆమె విలేఖరులతో మాట్లాడుతూ.. తన తండ్రి ప్రముఖ సినీనటుడు శోభన్‌బాబు(Shobhan Babu) అని తెలిపారు. బయటకు చెప్పుకోలేని వివిధ కారణాల వల్ల జయను వ్యక్తిగతంగా కలుసుకోలేకపోయానని, కానీ ఆమె సీఎంగా వున్నప్పుడు కొన్ని పనులపై రెండుసార్లు కలుసుకున్నానని తెలిపారు. అదేవిధంగా జయ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా ఓ సారి కలిశానన్నారు.

అయితే పలు కారణాల వల్ల తాను జయ కుమార్తెనని అప్పట్లో బహిరంగంగా ప్రకటించలేకపోయానన్నారు. జయ కుమార్తెనని నిరూపించుకునేందుకు తాను డీఎన్‌ఏ పరీక్షలకు కూడా సిద్ధమని, ఆ వివరాలను కోర్టుకు కూడా సమర్పిస్తానని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ‘అఖిల భారత ఎంజీఆర్‌ మున్నేట్ర కళగం’ పేరుతో పార్టీని ప్రారంభించానని, మొత్తం 39 నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని జయలక్ష్మి పేర్కొన్నారు. పార్టీ గుర్తుగా రెండు గులాబీలను ప్రకటించారు. పార్టీ అధికారులను కలిసేందుకు కొడైకెనాల్‌కు వచ్చానని చెబుతూ.. మా అమ్మ జయలలిత కోరిక తీర్చేందుకే కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానని తెలిపారు. తన తల్లి జయలలిత అనుమానాస్పద రీతిలో మృతి చెందారని, దీనికి చాలా మంది బాధ్యులయ్యారని చెప్పారు.




Updated : 16 Sept 2023 10:30 AM IST
Tags:    
Next Story
Share it
Top