Home > జాతీయం > ప్రధాని పదవికి రాహుల్ అర్హుడు : మెహబూబా ముఫ్తీ

ప్రధాని పదవికి రాహుల్ అర్హుడు : మెహబూబా ముఫ్తీ

ప్రధాని పదవికి రాహుల్ అర్హుడు : మెహబూబా ముఫ్తీ
X

దేశ ప్రధాని అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి అన్ని అర్హతలు ఉన్నాయని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తెలిపారు. ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్నవారి కన్నా రాహుల్‎కు మంచి విజన్ ఉందని ఆమె అన్నారు. భారత ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాలనే లక్ష్యం కలిగిన నేత రాహుల్ అని చెప్పారు. " దేశం యొక్క ఆలోచనలను ప్రపంచం ముందు ఉంచే విషయంలో రాహుల్‌కు ఎంతో నైపుణ్యం ఉంది. భారత దేశం కోసం గాంధీజీ ప్రాణాలు అర్పించారు. రాహుల్ ముత్తాత జైలుకు వెళ్లారు. ఆయన నానమ్మ, తండ్రి సైతం దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. భారత దేశ ఆలోచనను ముందుకు తీసుకెళ్లే అభిరుచి ఉన్న నేత రాహుల్. ఒక ప్రధానికి ఇంతకంటే అర్హత ఏం కావాలి?

ఇప్పుడు దేశంలో అధికారంలో ఉన్న ఈ గోరక్షకులు, ఇతరుల కంటే రాహుల్ గాంధీకి దేశం పట్ల ఓ దృక్పథం ఉంది. రాహుల్ ఉన్నత చదువులు చదివారు. అన్ని విషయాల పట్ల రాహుల్‎కు మంచి పట్టు ఉంది. ప్రధాని పదవికి బీజేపీలో ఒక్కరే అర్హులేమో.. కానీ ‘ఇండియా’ కూటమిలో మాత్రం నితీష్, మమతా బెనర్జీ, స్టాలిన్ వంటి చాలా మంది అర్హులైన నేతలు ఉన్నారు. రాహుల్ పీఎం అవుతారా.. కాదా.. అన్నది ముఖ్యం కాదు. మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశాన్ని సక్రమమైన దారిలో తీసుకెళ్లడానికి రాహుల్ ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తారనడంలో సందేహం లేదు"అని మెహబూబా ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


Updated : 17 Aug 2023 8:21 PM IST
Tags:    
Next Story
Share it
Top