Home > జాతీయం > బీజేపీ నాలుగో జాబితా విడుదల.. జనసేన అభ్యర్థుల్లో ఆశ

బీజేపీ నాలుగో జాబితా విడుదల.. జనసేన అభ్యర్థుల్లో ఆశ

బీజేపీ నాలుగో జాబితా విడుదల.. జనసేన అభ్యర్థుల్లో ఆశ
X

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల చేసింది. తొలి జాబితాలో 52మందికి, 33మందితో రెండో జాబితాను విడుదల చేసిన ఆ పార్టీ అధిష్టానం.. మూడో జాబితాలో ఒక్కరి పేరును ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన నాలుగో జాబితాలో 12మంది అభ్యర్థులకు చోటిచ్చింది. దీంతో బీజేపీ అభ్యర్థుల జాబితా 100మందికి చేరింది. దీంతో మిగిలిన 19 సీట్లపై ఉత్కంఠ నెలకొంది. కాగా జనసేనతో పెత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటీవల పవన్ కళ్యాణ్ తో జరిగిన భేటీలో.. రాష్ట్రంలో తొమ్మిది టికెట్లు ఇవ్వడానికి బీజేపీ సుముఖత చూపెట్టింది. అయితే బీజేపీ మిగిల్చిన 19 స్థానాలు జనసేనకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇవాళ హైదరాబాద్ రానున్న ప్రధాని మోదీతో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం.. ఆయా సీట్ల అభ్యర్థులు ఫైనల్ కానున్నట్లు సమాచారం.




Updated : 7 Nov 2023 12:16 PM IST
Tags:    
Next Story
Share it
Top