అణుబాంబు పితామహుడిని భారత్‌లోనే ఉండిపొమ్మన్న నెహ్రూ
X
అణుబాంబు పితామహుడు, అమెరికన్ శాస్త్రవేత్త రాబర్ట్ ఒపైన్‌హీమర్‌కు భారత్‌తో ఉన్న అనుబంధం గురించి కొత్త విషయాలు బయటికొస్తున్నాయి. ఆయన బయోపిక్ మూవీ రావడంతో 70 ఏళ్ల కిందటి సంఘటనలపై చర్చ జరుగుతోంది. అమెరికా ఆంక్షలు ఎదుర్కొన్న ఒపైన్‌హీమర్‌ను నాటి మన ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ భారతదేశానికి వచ్చి ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలని కోరినట్లు తెలిసింది. ఈమేరకు ఆయన ఒపైన్‌హీమర్‌కు రహస్య ఉత్తరం రాశారట. భారత అణు పితామహుడు హోమీ జహంగీర్ బాబా జీవిత చరిత్రను రాసిన భక్తియార్ దాదాభాయ్ తన పుస్తకంలో ఈ సంగతి వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం..
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బాబా ఒపైన్‌హీమర్‌ను కలిశారు... హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబు దాడి తర్వాత ప్రపంచ దేశాలు ఆందోళనపడ్డాయి. అలాంటి బాంబులు ఇకపై చేయొద్దని ఒపైన్‌హీమర్ చెప్పారు. దీంతో అమెరికా ప్రభుత్వం ఆయనను అనుమానించి ఆంక్షలు విధించింది. ఒపైన్‌హీమర్ దంపతులు కమ్యూనిస్టులు అనే ఆరోపణలు ఉండేవి. అమెరికా ప్రభుత్వం నుంచ చిక్కులు ఎదుర్కొంటున్న ఒపైన్‌హీమర్‌ను భారతదేశానికి రావాలని నెహ్రూ కోరారు. అయితే ఒపైన్‌హీమర్ అందుకు నిరాకరించాడు. భారత్ కు వెళ్తే తనపై మరింత అనుమానం కలుగుతుందన్నారు.
మరోవైపు.. ఒపైన్‌హీమర్ జీవితాన్ని ఆయన పేరుతోనే క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించారు. ఈ నెల 21న మనదేశంలో ఈ మూవీ విడుదలైంది. ఇందులో ఓ శృంగార సన్నివేశంలో భగవద్గీత శ్లోకాన్ని వాడడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. వివాదాస్పద సన్నివేశాలను తొలగించాలని కేంద్ర మూవీ టీమ్‌కు సూచించింది.