Home > జాతీయం > జవాన్కు అరుదైన గౌరవం.. ఎప్పుడూ చూసుండరు

జవాన్కు అరుదైన గౌరవం.. ఎప్పుడూ చూసుండరు

జవాన్కు అరుదైన గౌరవం.. ఎప్పుడూ చూసుండరు
X

తమ పిల్లలు సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కావాలని, బ్యాంక్ ఉంద్యోగం పొందాలని లేదా గవర్నమెంట్ ఆఫీసర్ గా స్థిరపడాలని చాలామంది కోరుకుంటారు. తమ పిల్లలు ఏసీ ఆఫీసుల్లో కూర్చొని జాబ్ చేస్తుంటే చూడాలని ఆశపడతారు. వందలో ఒక్కరిద్దరు మాత్రమే తమ పిల్లలు సైన్యంలో చేరి దేశ సేవ చేస్తూ భరతమాత రుణం తీర్చాలి అనుకుంటారు. దీంట్లో ముందు వరుసలో ఉంటుంది పంజాబ్ రాష్ట్రం. అంతేకాదు దేశమాత కోసం ఎంతోమంది వీర పుత్రులను త్యాగం చేసిన గడ్డగా పంజాబ్ కు పేరుంది. అందుకే మన సైన్యంలో ఎక్కువ మంది పంజాబ్ నుంచి ఉంటారు. అంతేకాకుండా పంజాబీల కోసం ప్రత్యేకంగా రెజిమెంట్ కూడా ఉంటుంది.





దేశం కోసం సేవ చేసి సెలవుల కోసం ఇంటికి వస్తే.. ఆ జవాన్ ను ప్రత్యేకంగా చూస్తారు. అక్కడక్కడ ఘన స్వాగతం పలుకుతారు. అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్మీ జవానుగా ఉద్యోగం పొంది ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చిన తమ కుమారునికి ఘనంగా స్వాగతం పలికారు తల్లిదండ్రులు. రోడ్డుపై నుంచి ఇంటి వరకు రెడ్ కార్పెట్ పరిచి, హారతులతో స్వాగతించారు. తర్వాత హత్తుకుని శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులకు ఆర్మీ సెల్యూట్ పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు ఆ జవాన్. ఆ జవాన్ రాకతో రాకతో అక్కడంతా కోలాహలం నెలకొంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఒక జవానుకు స్వాగతం పలకాల్సిన తీరు ఇదేనని కామెంట్ పెడుతున్నారు.





Updated : 15 Aug 2023 8:27 PM IST
Tags:    
Next Story
Share it
Top