నేడు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల
X
ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ నెల 4న జరిగిన ఈ ఎగ్జామ్కు దాదాపు 1.80 లక్షల మంది హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 30 వేల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. కటాఫ్ మార్కుల ఆధారంగా దాదాపు 45 వేల మందికి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్‌కు అర్హత కల్పిస్తారు. పాసైన వారు ఈ నెల 19 నుంచి మొదలయ్యే జోసా కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గతేడాది 23 ఐఐటీల్లో మొత్తం 16,598 సీట్లు అందుబాటులో ఉండగా.. ఈసారి మరికొన్ని పెరిగే ఛాన్సుంది. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలు, 32 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలు, మరో 38 కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో సీట్లను జోసా కౌన్సెలింగ్ ద్వారా భర్తీచేస్తారు. సోమవారం నుంచి జూలై 26 వరకు 38 రోజులపాటు కౌన్సెలింగ్ కొనసాగనుంది.
జోసా కౌన్సెలింగ్ షెడ్యూల్
జూన్ 19 రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్
జూన్ 25 మాక్ సీట్స్ అలాట్ మెంట్ -1
జూన్ 27 మాక్ సీట్స్ అలాట్ మెంట్ -2, ఆప్షన్స్ ఫ్రీజింగ్
జూన్ 28 రిజిస్ట్రేషన్ ముగింపు
జూన్ 29 సీట్ల కేటాయింపు కోసం డేటా వెరిఫికేషన్
జూన్ 30 మొదటి విడత సీట్ల కేటాయింపు
జూలై 06 రెండో విడత సీట్ల కేటాయింపు
జూలై 12 మూడో విడత సీట్ల కేటాయింపు
జూలై 16 నాలుగో విడత సీట్ల కేటాయింపు
జూలై 21 ఐదో విడత సీట్ల కేటాయింపు
జూలై 26 ఆరో విడత సీట్ల కేటాయింపు
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.