ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు
X
ఝర్ఖండ్ రాజకీయాల్లో అన్యూహ మలుపులు చోటు చేసుకుంటున్నాయి. హేమంత్ సొరెన్ రాజీనామాతో నూతన సర్కారు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్-జేఎంఎం ఎమ్మెల్యేలు 2 ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు బయల్ధేరారు. సొరెన్ అరెస్ట్ తో అప్రమత్తమైన కాంగ్రెస్.. ఎమ్మెల్యేలను భాగ్యనరంకు తరలిస్తున్నారు. ప్రత్యేక విమానం ద్వారా 35 మంది ఎమ్మెల్యేలు గచ్చిబౌలిలో హోటల్ ఎల్లాలో ఝార్ఖండ్ ఎమ్మెల్యేలకు వసతి కల్పించారు. ఆ రాష్ట్రంలో జేఎంఎం, కాంగ్రెస్ కూటమి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అప్రమత్తమైంది.
ఎమ్మెల్యేలు చేజారకుండా, ప్రభుత్వం మారకుండా కాంగ్రెైస్ పార్టీ చర్యలు చేపట్టింది. ఇండియా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించాలని హైకమాండ్ భావించింది. ఈ నేపధ్యంలో బీజేపీ తమ ఎమ్మెల్యేలను గాలం వేస్తుందన్న అనుమానంతో సంకీర్ణ కూటమి అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. నిన్న మహాకూటమి ఎల్‌పీ నేతగా చంపై సోరెన్ ఎన్నికయ్యారు. అటు ప్రభుత్వ ఏర్పాటుపై చంపై సోరెన్‌కు ఇంకా గవర్నర్ ఆహ్వానం లభించలేదు. అయితే మహాకూటమి ప్రభుత్వ ఏర్పాటు కష్టమే అని బీజేపీ నేతలు అంటున్నారు. ఆ కూటమికి 18 మంది ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే వ్యాఖ్యానించారు. మరోవైపు 81మంది సభ్యుల అసెంబ్లీలో తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, గవర్నర్ నుంచి ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నట్లు జేఎంఎం శాసనసభాపక్ష నేతగా చంపయీ సోరెన్ తెలిపారు.