Home > జాతీయం > NIA Team : బ్రిటన్కు విచారణ సంస్థలు.. భారత్కు నీరవ్ మోడీ, విజయ్ మాల్యా?

NIA Team : బ్రిటన్కు విచారణ సంస్థలు.. భారత్కు నీరవ్ మోడీ, విజయ్ మాల్యా?

NIA Team : బ్రిటన్కు విచారణ సంస్థలు.. భారత్కు నీరవ్ మోడీ, విజయ్ మాల్యా?
X

భారత్ లో నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయి స్థిరపడ్డ వారిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీ, విజయ్ మాల్యాలను తిరిగి భారత్ కు తీసుకురావడానికి భారత దర్యాప్తు సంస్థలు సిద్ధమయ్యాయి. అందుకుగానూ సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏల బృందాలు బ్రిటన్‌కు బయలుదేరనున్నారు. ఇతర దేశాల్లో ఉన్న వారి ఆస్తులను గుర్తించి వాటిపి స్వాధీనం చేసేకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. విదేశీ ఎంబసీలోని సీనియర్ అధికారులతో సంప్రదింపులు జరిపుతున్నారు. ఈ క్రమంలో లండన్ లోని భారత హైకమిషన్ ద్వారా యూకే అధికారులతో కోఆర్డినేషన్ జరిగింది.

పారిపోయిన వారి ఆస్తులు, బ్యాంక్ డీటెయిల్స్, లావాదేవీల గురించి అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు సన్నిహితుడైన సంజయ్ భండారీ.. కాంగ్రెస్ హయాంలో జరిగిన అనేక రక్షణ ఒప్పందాల్లో అక్రమాలకు పాల్పడ్డాడు. ఈ విషయంలో ఇన్ కంట్యాక్స్, ఈడీ విచారణ ప్రారంభించిన వెంటనే.. సంజయ్ భండారీ 2016లో విదేశాలకు పారిపోయాడు. కాగా పారిపోయిన వారి ఆస్తులను ఈడీ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. వారి ఆస్తుల్లో కొంత వేలంలో విక్రయించి చాలావరకు డబ్బు రికవరీ చేసింది. మిగతా బకాయిలను కూడా త్వరలో రాబడతామని దర్యాప్తు సంస్థలు తెలిపారు.




Updated : 16 Jan 2024 12:24 PM IST
Tags:    
Next Story
Share it
Top