మోడీ నివాసంలో కీలక భేటీ.. గంటన్నర పాటు సాగిన చర్చ
X
ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కీలక భేటీ ముగిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సమావేశంలో పాల్గొన్నారు. భేటీ దాదాపు గంటన్నర పాటు సాగింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తీసుకురావాల్సిన బిల్లుపై చర్చించినట్టు సమాచారం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనా ముగ్గురు నేతలు మంతనాల జరిపినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కేంద్రం ఈనెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. ఈ స్పెషల్ సెషన్ లో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ప్రస్తుతం కమిటీ మాత్రమే ఏర్పాటు చేశామని చెప్పారు. కమిటీ ఇచ్చే రిపోర్టుపై చర్చించనున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఎజెండాను 3-4 రోజుల్లో ప్రకటిస్తామని మంత్రి చెప్పారు.