Home > జాతీయం > Supreme Court : 'అమాయకులెవరికీ శిక్ష పడకూడదు.. దోషులెవరూ తప్పించుకోకూడదు': సుప్రీం

Supreme Court : 'అమాయకులెవరికీ శిక్ష పడకూడదు.. దోషులెవరూ తప్పించుకోకూడదు': సుప్రీం

Supreme Court : అమాయకులెవరికీ శిక్ష పడకూడదు.. దోషులెవరూ తప్పించుకోకూడదు: సుప్రీం
X

పాట్నా హైకోర్టు జడ్జీలపై సుప్రీంకోర్టు తీవ్ర విమర్శలు చేసింది. జడ్జీలు నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఉండాలి కానీ కళ్లు మూసుకుని మౌన ప్రేక్షకునిగా ఉంటూ ఓ రోబో మాదిరిగా వ్యవహరించకూడదని గట్టి వ్యాఖ్యలు చేసింది. ఓ కేసు విచారణలో కింది కోర్టు విధించిన మరణశిక్షను పాట్నా హైకోర్టు గుడ్డిగా సమర్థించినందుకు సుప్రీంకోర్టు ఆ రెండు న్యాయస్థానాల జడ్జీలను మందలించింది.

8 ఏండ్ల క్రితం నాటి కేసు...

బిహార్‌లోని భాగల్పుర్‌ జిల్లాలో 2015 జూన్‌ 1న టీవీ చూసేందుకు ఓ వ్యక్తి ఇంటికి వెళ్లిన 11 ఏళ్ల బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడి ఆపై బాలికను గొంతు కోసి చంపాడని కేసు నమోదైంది. 2017లో భాగల్పుర్‌ ట్రయల్ కోర్టు ఈ నేరాన్ని అరుదైన కేటగిరీకి చెందినదిగా పరిగణిస్తూ.. నిందితుడిపై అత్యాచారం, హత్య కేసులో దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. దీంతో నిందితుడు 2018 లో పాట్నా హైకోర్టు ఆశ్రయించగా.. అక్కడ కూడా ఫలితం లేకుండా పోయింది. అతని అప్పీల్ ను తిరస్కరించి మరణశిక్షను నిర్ధారించింది. నిందితుడు ఆ తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రల ధర్మాసనం మంగళవారం విచారించింది.

ఫొరెన్సిక్ రిపోర్ట్ ఎక్కడ?

మొత్తం విచారణలో చాలా తీవ్రమైన లోపాలు జరిగాయని, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ రిపోర్ట్ కూడా రాలేదని సుప్రీం విచారణలో భాగంగా పేర్కొంది. పైన జరిగిన పొరపాటు కేవలం చిన్న లోపం మాత్రమే అయినా.. ఇది దర్యాప్తు అధికారి నుండి చాలా తీవ్రమైన తప్పు అని, అటువంటి తీవ్రమైన కేసులో కూడా ఇది చాలా తీవ్రమైన తప్పు అని చెప్పడానికి మేము విచారిస్తున్నామని బెంచ్ పేర్కొంది. నిందితుడిగా చెప్పబడుతున్న వ్యక్తికి మెడికల్ ప్రాక్టీషనర్ చేత వైద్యపరీక్షలు కూడా చేయించలేదు. బాధితురాలి ఇంటికి నిందితుడు వచ్చి, టీవీ చూసేందుకు తన ఇంటికి రావాలని చెప్పడం ఆధారంగా హైకోర్టు ఒక నిర్ణయానికి రావడం దిగ్భ్రాంతికరంగా ఉందని తెలిపింది.

రోబోలా? రికార్డింగ్‌ యంత్రాల్లా?

ఈ కేసులోనే మరో వ్యక్తి ఆరోజు నిందితురాలి ఇంటికి వచ్చి ఆమెను తనతోపాటు తీసుకువెళ్లాడని ఇతర సాక్షులంతా పోలీసుల ఎదుట చెప్పారు. ఈ పాయింట్‌ మీద దిగువ కోర్టులేవీ దృష్టి సారించకపోవడం దురదృష్టకరం. దీనిపై తగిన ప్రశ్నలు సంధించడం జడ్టీల కర్తవ్యం. వారు అత్యంత నిష్పాక్షికంగా వ్యవహరించడంతో పాటు- ఏదో ఒక పక్షంపై వ్యక్తిగత అభిప్రాయాలతో తీర్పు చెప్పారన్న ముద్రకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. ఆయా పక్షాలు చెప్పే సమాచారం ఆధారంగా రోబోల మాదిరిగానో, రికార్డింగ్‌ యంత్రాల్లానో వ్యవహరించకూడదు. అమాయకులెవరికీ శిక్ష పడకూడదు. దోషులెవరూ తప్పించుకోకూడదు’ అని సూచించారు.




Updated : 6 Sep 2023 3:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top