Home > జాతీయం > కొత్త భారతదేశాన్ని నిర్మిద్దాం.. కమల్ హాసన్ వీడియో సందేశం

కొత్త భారతదేశాన్ని నిర్మిద్దాం.. కమల్ హాసన్ వీడియో సందేశం

కొత్త భారతదేశాన్ని నిర్మిద్దాం.. కమల్ హాసన్ వీడియో సందేశం
X

కొత్త భారత దేశాన్ని నిర్మిద్దామని ప్రముఖ నటుడు కమల్ హాసన్ యువతకు పిలుపునిచ్చాడు. నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఆయన ఓటు విలువను చెప్తూ.. ఓ వీడియో సందేశం రిలీజ్ చేశాడు. ‘ఓటు అనేది దేశంపై మనకున్న నిబద్ధతను తెలుపుతుంది. నేషనల్ ఓటర్స్ డే 2024 సందర్భంగా.. ప్రతిఒక్కరం ఓటు హక్కును వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేద్దాం. కొత్త విప్లవాన్ని సృష్టిద్దాం. కొత్త లీడర్లను ఎన్నుకుని, కొత్త భారత దేశాన్ని నిర్మిద్దా’మని సందేశం ఇచ్చారు. ఓటు ఒక్క పార్టీకి, ఒక్క నాయకుడికి పరిమితమైంది కాదని అన్నారు. ప్రతీ ఒక్కరి ఓటు గతాన్ని, ప్రస్తుత పరిస్థితిని, భవిష్యత్తును తెలిపే ఆయుధంగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాతో పాటు.. మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్, ప్రభాస్ కల్కీ సినిమాలో నటిస్తున్నారు.





Updated : 25 Jan 2024 9:52 PM IST
Tags:    
Next Story
Share it
Top