Home > జాతీయం > switch to BJP: పార్లమెంట్ ఎన్నికల వేళ ఇండియా కూటమికి గుడ్ బై చెప్పనున్న నేతలు

switch to BJP: పార్లమెంట్ ఎన్నికల వేళ ఇండియా కూటమికి గుడ్ బై చెప్పనున్న నేతలు

switch to BJP: పార్లమెంట్ ఎన్నికల వేళ ఇండియా కూటమికి గుడ్ బై చెప్పనున్న నేతలు
X

పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌ నాథ్‌ బీజేపీలోకి చేరతారంటూ ప్రచారం జరుగుతుండగా.. పంజాబ్‌కు చెందిన ఓ సీనియర్ నేత కూడా ఆయన బాటలోనే వెళ్తున్నట్టు సమాచారం. పంజాబ్‌కు చెందిన ఆనంద్‌పూర్‌ సాహిబ్ ఎంపీ మనీష్ తివారీ కమలం కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పంజాబ్‌లోని లూథియానా నుంచి ఆయన పోటీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన కమల్ నాథ్.. పార్టీ నాయకత్వం తనకు రాజ్యసభ టిక్కెట్ నిరాకరించడంతోనే భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి మారాలని ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కమల్ నాథ్ బీజేపీలో చేరిక విషయపై.. అటు కాంగ్రెస్ నాయకత్వం కూడా ఆయన్ను సంప్రదించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని, దీంతో కాంగ్రెస్ ను వీడినున్నారనే టాక్ కన్ఫామ్ అని కొందరు అంటుండగా.. రాజ్యసభ టిక్కెట్ కోసం కమల్ నాథ్.. బీజేపీతో కాస్త గట్టిగానే లాబీయింగ్ చేయడంతో ఆ విషయాలన్నీ ఓ కొలిక్కి వచ్చాయని ఇంకొందరు అంటున్నారు. రాజ్యసభ టికెట్ కోసం కమల్ నాథ్.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కూడా కలిశారని.. అయితే అధిష్టానం అందుకు తిరస్కరించిందని ఊహాగానాలు వెలువడుతున్నాయి.కమల్‌నాథ్‌, ఆయన కుమారుడు నకుల్, ఇతర ఎంపీలు, దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ జితూ పట్వారీ మాత్రం.. ఇందుకు భిన్నంగా స్పందించారు. కమల్‌నాథ్‌ బీజేపీలో చేరతారనే విషయాన్ని ఖండిస్తూ.. కనీసం కలలో కూడా కమల్‌నాథ్‌ బీజేపీలో చేరరని తేల్చిచెప్పారు.

ఇదిలా ఉండగా... తాజాగా పంజాబ్ ఎంపీ మనీష్ తివారీ.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు సిద్ధం అయినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఆయన బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నట్లు ఊహాగానాలు నడుస్తున్నాయి. ఆయన కాంగ్రెస్‌కు రాజానామా చేసి.. బీజేపీలో చేరుబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఎంపీ మనీష్‌ తివారీపై జరుగుతున్న ప్రచారం అసత్యమని ఆయన ఆఫీసు వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఎంపీ మనీష్‌ తివారీపై జరుగుతున్న పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించింది. అదంతా అసత్య ప్రచారమని స్పష్టం చేసింది. బీజేపీలో చేరి.. లూథియానా స్థానంలో పోటీ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. ‘మనీష్‌ పార్టీ మారి బీజేపీలో చేరుతారనేది నిరధారమైన విషయం. ఆయన తన నియోజకవర్గంలో పూర్తి దృష్టి పెట్టారు. గత రాత్రి మనీష్‌ తివారీ తన నివాసంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు’ అని ఎంపీ కార్యాలయం పేర్కొంది.

ఇక మరో కీలక నేత, పంజాబ్ లీడర్ నవ్యజోత్ సింగ్ సిద్ధూ కూడా హస్తానికి గుడ్ బై చెబుతారనే టాక్ వినిపిస్తోంది. హైకమాండ్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సిద్ధూ కాంగ్రెస్‌కు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో వార్తలు జోరందుకున్నాయి. సిద్ధూ కాంగ్రెస్‌ను వీడి త్వరలోనే బీజేపీ చేరనున్నట్లు సమాచారం. ఒక వేళ ఇది కనుక జరిగితే పార్లమెంట్ ఎన్నికల వేళ పంజాబ్‌లో కాంగ్రెస్‌కు భారీ దెబ్బేనని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరీ సిద్ధూ పార్టీ మారుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది. పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు నేతలు బీజేపీ పార్టీలో చేరటం కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. ఇక​.. కాంగ్రెస్‌ నేతలు బీజేపీలో చేరితే కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ‘ఇండియా కూటమి’ లోక్‌సభ ఎన్నికల్లో తగిన ప్రభావం చూపలేకపోతుందని రాజకీయా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Updated : 18 Feb 2024 2:32 PM IST
Tags:    
Next Story
Share it
Top