Home > జాతీయం > బస్సులో పాటలు విన్నందుకు 10వేల జరిమానా

బస్సులో పాటలు విన్నందుకు 10వేల జరిమానా

బస్సులో పాటలు విన్నందుకు 10వేల జరిమానా
X

బస్సులో పాటలు వినడం తప్పు కాదు. కానీ పక్కవారిని ఆ సౌండ్స్‎తో ఇబ్బంది పెడితేనే జేబుకు చిల్లు పడటం గ్యారెంటి అని ఈ సంఘటన రుజువు చేస్తోంది.

ఓ ప్రైవేటు బస్సులో విపరీతమైన సౌండ్ పెట్టి పాటలను వింటూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన కండక్టర్ , డ్రైవరుతో పాటు బస్సు ఓనర్‎కు తగిన శాస్తి చెప్పారు ఓ న్యాయమూర్తి. ప్రయాణికుల భద్రతను గాలిలోకి వదిలేసిన ముగ్గిరికి ఏకంగా రూ.10 వేల జరిమానా విధించారు. దీంతో అప్పటి వరకు పాటలను వింటూ చిల్ అయిన వారి జోబులకు చిల్లు పడినట్లైంది.

కాంచీపురానికి చెందిన న్యాయమూర్తి సెమ్మల్‌ గురువారం ఓ పని మీద బయటకు వచ్చారు. ఉదయం కాంచీపురం నుంచి దిండివనానికి వెళ్లి అక్కడ పనులు ముగించుకొని ఒక ప్రైవేటు బస్సు ఎక్కారు. ఆ బస్సు కాస్తా కాంచీపురానికి స్టార్ట్ అయ్యింది. ఆ సమయంలో ప్రయాణంలో కొంత ఊపు ఉండాలని భావించిన డ్రైవరు బస్సులో ప్రయాణీకుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన టేప్‌ రికార్డరును ఆన్ చేశారు. అందులో పెద్ద సౌండ్ పెట్టి పాటలకు వింటూ ఎంజాయ్ చేశాడు. అయితే ఆ శబ్దాలు కాస్త ఇబ్బందిగా అనిపించడంతో న్యాయమూర్తి సెమ్మల్‌ శబ్ధం తగ్గించాలని డ్రైవర్‌ను, కండక్టర్‌ను కోరారు. కానీ వారు రెస్పాండ్ కాలేదు. దీంతో చేసేదేమి లేక ట్రాఫిక్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కాంచీపురం మూంగిల్‌ మంటపం దగ్గరకు వచ్చి బస్సును అడ్డుకొన్నారు. ఆ తరువాత బస్సులో నుంచి దిగిన న్యాయమూర్తి, ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు గాను కండక్టరు, డ్రైవర్‌కు బస్సు యజమానికి రూ.10 వేల జరిమానా వేశాడు. ఇప్పటికైనా ప్రయాణికుల భద్రతపై దృష్టిసారించాలని కండక్టరు, డ్రైవరుకు హితవు పలికారు.

Updated : 1 July 2023 5:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top