Accident: దంపతులను కారుతో ఢీకొట్టిన ప్రముఖ నటుడు.. మహిళ మృతి
X
కన్నడ నటుడు నాగభూషణ అరెస్ట్ అయ్యారు. యాక్సిడెంట్ కేసులో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన కారుతో అతివేగంగా వెళ్లి ఓ జంటను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో భార్య మరణించగా.. భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నాగభూషణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
నటుడు నాగభూషణ శనివారం రాత్రి తన కారులో ఉత్తరహళ్లి నుంచి కోననకుంట వైపు వెళ్తున్నాడు. రాత్రి 9.45 గంటల సమయంలో వసంతపుర ప్రధాన రహదారి వద్ద ఫుట్ పాత్పై నడుచుకుంటూ వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టింది. తరువాత ఓ కరెంట్ పోల్ ను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదం దంపతులకు తీవ్రగాయాలవ్వగా.. ఆస్పత్రికి తరలించేలోపే మహిళ మరణించింది. ప్రస్తుతం భర్త కృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దంపతుల కొడుకు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు.
నాగభూషణ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అతడు ఆరోపించాడు. కాగా కన్నడలో 2018లో విడుదలైన సంకష్ఠ కర గణపతి అనే సినిమాతో నాగభూషణ ఎంట్రీ ఇచ్చాడు. కౌసల్య సుప్రజా రామ, డేర్డెవిల్ ముస్తాఫా, బడవ రాస్కెల్, ఇక్కాత్,హనీమూన్ వంటి పలు సినిమాల్లో నటించారు. ఇక్కాత్ చిత్రంలో నటనకు గాను సైమా ఆవార్డు కూడా అందుకున్నాడు.
#Kannada actor #Nagabhushana rammed his #car into a couple walking on the #footpath near #Vasanthnagar main road in #Bengaluru around 9.45 pm. The woman died.
— Madhuri Adnal (@madhuriadnal) October 1, 2023
He was heading towards Konanakunte from Uttarahalli. Actor himself took the couple to the hospital. #accident #arrest pic.twitter.com/tAWrdX2yR2