Home > జాతీయం > పోలీస్ భయంతో.. బల్లిని మింగేశాడు.. ఆ తర్వాత..!

పోలీస్ భయంతో.. బల్లిని మింగేశాడు.. ఆ తర్వాత..!

పోలీస్ భయంతో.. బల్లిని మింగేశాడు.. ఆ తర్వాత..!
X

పోలీస్ శిక్ష నుంచి తప్పించుకోవడానికి నిందితులు.. కోర్టుల చుట్టూ తిరుగుతూ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన మహేశ్ అనే వ్యక్తి జైలు నుంచి తప్పించుకునేందుకు బల్లిని మింగేశాడు. అత్యాచారం ఘటనలో ఆరోపణలు ఎదుర్కుంటున్న మహేశ్ ను.. విచారణ కోసం పోలీస్ లు స్టేషన్ కు తీసుకెళ్లారు. దాంతో తనను జైల్లో పెట్టి శిక్షిస్తారేమో అని భావించిన మహేశ్.. బతికున్న బల్లిని మింగేశాడు. తర్వాత విచారణ అంతా పూర్తయే టైంలో మహేశ్ స్పృహ తప్పి పడిపోయాడు.

దాంతో అప్రమత్తమైన పోలీసులు.. మహేశ్ ను పరీక్షించగా అతని నోట్లో బల్లి కనిపించింది. దాంతో వెంటనే హాస్పిటల్ కు తరలించగా.. ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు తెలిపారు. తర్వాత మహేశ్ పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ.. ఘటనలో మహేశ్ లేడని, అతనిపై కేసును ఉపసంహరించుకుంది.



Updated : 11 July 2023 9:09 AM IST
Tags:    
Next Story
Share it
Top