Home > జాతీయం > Basangouda Patil: భారత్ తొలి ప్రధాని నెహ్రూ కాదు.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్..

Basangouda Patil: భారత్ తొలి ప్రధాని నెహ్రూ కాదు.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్..

Basangouda Patil: భారత్ తొలి ప్రధాని నెహ్రూ కాదు.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్..
X

"కేంద్ర మాజీ మంత్రి, కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్ గౌడ్ పాటిల్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు." భారత తొలి ప్రధాని నెహ్రూ కాదని.. సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. కర్నాటకలో నిర్వహించిన ఓ మీటింగ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రిటిషర్లను నేతాజీ భయంపెట్టడం వల్లే వాళ్లు దేశాన్ని విడిచి వెళ్లారని.. అహింస మార్గం, నిరాహారదీక్షల వల్ల దేశానికి స్వాతంత్ర్యం రాలేదని చెప్పారు.

‘‘మన దేశానిక ప్రథమ ప్రధాని నెహ్రూ కాదు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతాజీ బ్రిటిషర్లకు భయం రుచి చూపించడంతో వాళ్లు దేశం విడిచి వెళ్లారు. భారతీయులు చేసిన నిరాహార దీక్షలు, అహింస, ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించడం వల్ల మనకు స్వాతంత్ర్యం రాలేదు. బ్రిటిషర్లను భయపెట్టడం వల్ల మాత్రమే స్వాతంత్ర్యం వచ్చింది’’ అని బసన్ గౌడ్ అన్నారు.

ఇదే విషయాన్ని అంబేద్కర్‌ తాను రాసిన ఓ పుస్తకంలోనూ ఉందని బసన్‌గౌడ చెప్పారు. ‘‘ రెండో ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత దేశంలోని కొన్ని ప్రాంతాలకు బ్రిటిషర్లు స్వాతంత్ర్యం ప్రకటించారు. ఆయా ప్రాంతాల వారికి సొంత కరెన్సీ, జెండా, జాతీయగీతం ఉండేవి. అప్పటికి దేశ ప్రధాని ఆజాద్‌ హింద్‌ఫౌజ్‌ను నడిపిస్తున్న సుభాష్‌ చంద్రబోస్‌. అందుకే మన తొలి ప్రధాని నెహ్రూ కాదు.. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అని ప్రధాని మోదీ కూడా చెబుతుంటారు’’ అని బసన్‌గౌడ వివరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. గతంలో కూడా ఆయన పలుు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Updated : 28 Sept 2023 4:59 PM IST
Tags:    
Next Story
Share it
Top