కర్నాటక సీఎం సాహసం.. ఏ ముఖ్యమంత్రీ చేయని ‘శని’ పని చేసిన సిద్దు
X
కర్నాటక ముఖ్యమంత్రి ఎం. సిద్ధరామయ్య అరుదైన సాహసం చేశారు. రాష్ట్రం ఏ ముఖ్యమంత్రీ చేయని ‘అరిష్టం’ పని చేసి, హీరో అనిపించుకున్నారు. పైకి అదేమంత గొప్పపని కాకపోయినా తన కార్యాలయంలోనే తిష్టవేసిన మూఢనమ్మకాల నిర్మూలన దిశగా సంచలన నిర్ణయమేనని ప్రసంశలు అందుకుంటున్నారు. వాస్తు దోషంతో దశాబ్దాలపాటు మూతపడిన విదాన సభలోని తన చాంబర్ పడమటి తలుపును ఆయన శనివారం తిరిగి తెరిపించారు.
చక్కగా గాలీ వెలుతూ వచ్చే ఆ తలుపు మూసేయడం సరికాదని అధికారులను సీఎం మందలించారు. అరిష్టమని ముద్రపడ్డ ఆ తలుపు గుండానే ధైర్యంగా తన చాంబర్‌లోకి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆయన సాహసి అని కొందరు మెచ్చుకుంటుంటే, శని పట్టుకోవడం, పదవి ఊడడం ఖాయమని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1998లో ఆనాటీ సీఎం జేహెచ్ పటేల్ ఎన్నికల్లో ఓడిపోయాక, ఆ తలుపు వల్లే ఓడినట్లు భావించి తలుపుకు తాళం వేసి మూసేయించారు. సిద్ధరామయ్య 2013లో ఇదివరకు సీఎంగా ఎన్నికైనప్పుడు దాన్ని తెరిపించారు. ఆయన తర్వాత గద్దె ఎక్కిన సీఎంలు మళ్లీ మూయించారు. యడియూరప్ప, బసవరాజు బొమ్మై, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఆ అరిష్టం నమ్మకాన్ని నమ్మి సాహసం చేయలేకపోయారు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగించడంతో మళ్లీ సీఎం అయిన సిద్దు మొండిగా ఆ తలుపును బార్లా తెరిపించారు.
CM @siddaramaiah asks his officers to open the west door of his chamber as it was closed for years due to “Vastu” reason. He noticed the door shut and asked his staff why’s it shut and they said vastu. He stood there and made them open the west gate and entered through the same. pic.twitter.com/2PRz7iLxOc
— Nagarjun Dwarakanath (@nagarjund) June 24, 2023