Karnataka Govt : ఇవాళ ఢిల్లీలో సీఎంల ధర్నా.. కేంద్రం తీరుకు నిరసనగా..
X
కేంద్రం తీరుపై కర్నాటక, కేరళ ప్రభుత్వాలు కన్నెర్ర జేశాయి. కేంద్రం తీరుకు నిరసనగా ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఇవాళ ఇరు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారు. కేంద్రం ఆర్థిక దౌర్జన్యాలు, వివక్షకు పాల్పడుతుందంటూ కర్నాటక ప్రభుత్వం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనుంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ నిరసనలో పాల్గొననున్నారు. ఇప్పటికే వారంతా ఢిల్లీ చేరుకున్నారు.
కేంద్రం తీరుతో కర్నాటకకు రూ.1.87 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని సిద్ధరామయ్య సర్కార్ ఆరోపించింది. మేరా ట్యాక్స్ మేరా అధికార్ అనే హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాలోనూ ఆందోళన చేస్తోంది. గ్రాంట్లు ఇవ్వడం, సౌకర్యాలు కల్పించడంలోనూ వివక్ష ప్రదర్శిస్తోందని సీఎం మండిపడ్డారు. మరోవైపు కేరళ సీఎం పినరయి విజయన్ సైతం ఢిల్లీ చేరుకున్నారు. కేంద్రం తీరుకు నిరసనగా ఆయన కూడా ఈ ఆందోళనలో పాల్గొననున్నారు. సీఎంల ధర్నాతో ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.