Home > జాతీయం > అమెరికాలో భారతీయ దంపతుల ఆత్మహత్య.. చిన్నారితో సహ..

అమెరికాలో భారతీయ దంపతుల ఆత్మహత్య.. చిన్నారితో సహ..

అమెరికాలో భారతీయ దంపతుల ఆత్మహత్య.. చిన్నారితో సహ..
X

అమెరికాలో నివాసం ఉంటున్న కర్ణాటకలోని దావంగెరెకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. దావణగెరె జిల్లా జగళూరు తాలూకా హలేకల్లు గ్రామానికి చెందిన యోగేశ్‌ హొన్నాళ (37), ప్రతిభా హొన్నాళ (35), వారి కొడుకు యశ్‌ హొన్నాళ (6) అమెరికాలోని మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌ నగరంలో నివసిస్తున్నారు. తొమ్మిదేళ్ల నుంచి యోగేశ్‌ దంపతులు అమెరికాలోనే ఐటీ ఇంజినీర్లుగా ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. అప్పుడప్పుడూ సొంతూరికి వచ్చి బంధుమిత్రులను కలిసేవారు.

ఈ ముగ్గురు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారని వార్తలు వస్తున్నాయి. గురువారమే యోగేశ్‌ దావణగెరెలోని తల్లి శోభతో ఫోన్‌లో మాట్లాడారు. ఏం జరిగిందో కానీ శనివారం కుటుంబసభ్యులకు ముగ్గురి మరణవార్త చేరింది. వారు ఆత్మహత్య చేసుకున్నారని బాల్టిమోర్‌ పోలీసులు ప్రకటించారు. ఆగస్టు 19న పోలీసులు తమకు ఫోన్ చేసి ఈ విషాద వార్త గురించి చెప్పారని యోగేష్ తల్లి శోభ చెబుతున్నారు. " గత తొమ్మిదేళ్లుగా నా కొడుకు మరియు కోడలు యుఎస్‌లో సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు. ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటో మాకు తెలియదు" అని ఆమె పేర్కొంది. పోలీసులు కూడా వీరి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. వీరి మృతదేహాలను భారతదేశానికి తీసుకురావడానికి సహాయం చేయాలని ఇరువురి కుటుంబాలు ప్రభుత్వాన్ని కోరాయి.



Updated : 20 Aug 2023 9:00 AM IST
Tags:    
Next Story
Share it
Top