Home > జాతీయం > ఫాక్స్కాన్కు లెటర్ రాయలేదు.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్

ఫాక్స్కాన్కు లెటర్ రాయలేదు.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్

ఫాక్స్కాన్కు లెటర్ రాయలేదు.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్
X

ఫాక్స్కాన్ కంపెనీని కర్నాటకకు తరలించాలని లేఖ రాశారన్న వార్తలపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. ఆ వార్తలను తీవ్రంగా ఖండించారు. తాను ఫాక్స్ కాన్ గ్రూపునకు ఎలాంటి లేఖ రాయలేదని స్పష్టం చేశారు. తన పేరుతో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న లెటర్ ఫేక్ అని శివకుమార్ తేల్చి చెప్పారు. దీనిపై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు.

ఇదిలా ఉంటే మేడిగడ్డ బ్యారేజీ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు బీఆర్ఎస్ ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఫేక్ లెటర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెబుతున్నారు. డీకే శివకుమార్ లెటర్ మార్ఫింగ్ చేసి ఫేక్ లెటర్ సృష్టించారని పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ మండిపడ్డారు. అబద్దపు ప్రచారం చేయడంలో కేటీఆర్ నెంబర్ వన్ అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే కేటీఆర్ తమ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేయడం సరికాదని హితవు పలికారు.

కేటీఆర్ గ్రామస్థాయి, బూత్ స్థాయి నాయకుడిలా మాట్లాడారని చామల కిరణ్ సటైర్ వేశారు. చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎలా బద్నాం చేయాలా? అని కేటీఆర్ కంకణం కట్టుకున్నారని విమర్శించారు. తాము బస్సు పెట్టి... కర్నాటక పర్యటనకు రావాలని సవాల్ విసిరితే కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.




Updated : 4 Nov 2023 5:55 PM IST
Tags:    
Next Story
Share it
Top