Home > జాతీయం > Nirudyoga Bruthi : యువతకు గుడ్ న్యూస్.. జనవరి 1 నుంచి నిరుద్యో భృతి.. కండిషన్స్ ఏంటంటే..?

Nirudyoga Bruthi : యువతకు గుడ్ న్యూస్.. జనవరి 1 నుంచి నిరుద్యో భృతి.. కండిషన్స్ ఏంటంటే..?

Nirudyoga Bruthi : యువతకు గుడ్ న్యూస్.. జనవరి 1 నుంచి నిరుద్యో భృతి.. కండిషన్స్ ఏంటంటే..?
X

కర్నాటకలో అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీలను అమలు చేసింది. ఆ ఐదు గ్యారంటీల్లో ఒకటైన యువ నిధి పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధం అయింది. ఈ క్రమంలో నిరుద్యోగ భృతిని తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఇప్పటికే ఈ పథకం అమలు కావాల్సి ఉండగా.. పలు సమీకరణాల దృష్ట్యా.. కాస్త ఆలస్యం అయింది. కాగా జనవరి 1, 2024 నుంచి నిరుద్యోగభృతి పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అర్హులైన నిరుద్యోగులు.. సేవా సింధు వెబ్ సైట్ లో డిసెంబర్ 26 నుంచి దరఖాస్తు పెట్టుకోవచ్చని సూచించారు.

ఇందులో భాగంగానే కొన్ని మార్గదర్శకాలను కూడా కర్నాటక ప్రభుత్వం జారీ చేసింది. 2022-23 విద్యాసంవత్సరంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. తర్వాత ఆరు నెలల వరకు జాబ్ లేని నిరుద్యోగులు నిరుద్యోగభృతి కోసం అప్లై చేసుకోవడానికి అర్హులు. డిగ్రీ, డిప్లమా హోల్డర్లకు కూడా ఈ పథకం వర్తింస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు, డిప్లమా చేసినవారికి రూ. 1500 ఆర్థక సాయం అందించనున్నారు.




Updated : 15 Dec 2023 4:46 PM IST
Tags:    
Next Story
Share it
Top