స్టడీ టూర్లో టీచర్ ప్రేమ పాఠాలు.. సోషల్ మీడియాలో వైరల్
X
విద్యా బుద్ధులు నేర్పించి.. విద్యార్థులను మంచి భావి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు, విద్యార్థితో అనుచితంగా ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్నాటకలోని చింతామణి తాలూకా, మురుగమల్లా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్టడీ టూర్‌లో భాగంగా విద్యార్థులతో కలిసి వెళ్లిన ఆ టీచర్.. ఓ విద్యార్ధితో సన్నిహితంగా ఉంటూ (రొమాంటిక్ ఫొటోషూట్) ఓ ఫోటో షూట్ చేశారు. ఈ ఫొటోషూట్ లో స్టూడెంట్.. టీచర్ ను కౌగిలించుకోవడం, ముద్దుపెట్టుకోవడం, చీర లాగడం వంటివి స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఫొటోలపై జనాలు తీవ్రంగా మండిపడుతున్నారు. విద్యా బుద్ధులు నేర్పి, విద్యార్థులను తీర్చి దిద్దాల్సిన గురువే ఇలా చేస్తే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ ఫొటోలను అమిత్ సింగ్ రజావత్ అనే పర్యావరణవేత్త తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ‘‘ఈ సమాజం ఎటువైపు వెళ్తుంది? 10వ తరగతి విద్యార్థితో.. స్కూల్ టీచర్ రొమాంటిక్ ఫొటోషూట్ చేయడం ఏంటి? ఆ ఫొటోషూట్ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి’’ అంటూ ఆయన ట్వీట్ చేశాడు.
ఆ టీచర్ ప్రవర్తనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థి తల్లిదండ్రులు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈవో)కి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. కాగా, వైరల్ అయిన ఈ ఫొటోల్లో టీచర్, విద్యార్థి ఎవరనేది స్ఫష్టం కాలేదు. అయినా.. ఈ వివాదంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరేమో ఈ ఫొటోల్లో తప్పేముందని కామెంట్ చేస్తుంటే.. మరికొందరేమో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తప్పించుకునే అవకాశం ఇవ్వొద్దని తిట్టిపోస్తున్నారు. కాగా ఈ వివాదంపై బీఈవో (BEO) ఉమాదేవి పాఠశాలను సందర్శించి విచారణ చెపట్టారు.
Where are we heading as a society ?
— Amit Singh Rajawat (@satya_AmitSingh) December 28, 2023
Pictures and videos from a romantic photoshoot of a government school teacher with a Class 10 student in Karnataka's Murugamalla Chikkaballapur district, went viral, following which the student's parents filed complaint with the Block… pic.twitter.com/WviIHtOP3J