Home > జాతీయం > రాజస్థాన్లో దారుణం.. కర్ణిసేన అధ్యక్షుడిపై కాల్పులు

రాజస్థాన్లో దారుణం.. కర్ణిసేన అధ్యక్షుడిపై కాల్పులు

రాజస్థాన్లో దారుణం.. కర్ణిసేన అధ్యక్షుడిపై కాల్పులు
X

రాజస్థాన్‌ దారుణం జరిగింది. రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు బన్వర్‌సింగ్‌పై గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. కాల్పుల ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఉదయ్‌పుర్‌లో రాజ్‌పుత్ కర్ణిసేన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బన్వర్‌ సింగ్‌ హాజరయ్యాడు. వేదికపై నుంచి ఆయన కిందికి దిగి వెళ్తుండగా.. అక్కడకు వచ్చిన ఓ వ్యక్తి బన్వర్‌ సింగ్‌ను గన్తో కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన బన్వర్ సింగ్ ను హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.

ఇదిలా ఉంటే కాల్పులకు పాల్పడిన వ్యక్తిని కర్ణిసేన కార్యకర్తలు పట్టుకున్నారు. అతన్ని కర్ణిసేన మాజీ సభ్యుడైన దిగ్విజయ్గా గుర్తించారు. కాల్పులు జరిపినందుకు ఆతనిపై దాడికి దిగారు. తీవ్రంగా కొట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. పోలీసులు వచ్చి అతన్ని కాపాడారు. పాత కక్షల కారణంగానే నిందితుడు దిగ్విజయ్ హత్యాయత్నం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన నిందితున్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కర్ణిసేనను దెబ్బతీసేం ఉద్దేశంతోనే ఈ దాడి చేశారని జాతీయాధ్యక్షుడు మహిపాల్‌ మక్రానా ఆరోపించారు. బన్వర్‌ సింగ్‌ వెన్నులోకి బుల్లెట్ దూసుకుపోవడంతో వైద్యులు ఆయనను బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు.




Updated : 13 Aug 2023 5:10 PM IST
Tags:    
Next Story
Share it
Top