కేరళకు క్రిస్మస్ కిక్కు.. మూడు రోజుల్లో ఫుల్లుగా తాగేశారు..
X
పండుగలు వచ్చాయంటే ఫుల్ కిక్కు ఉండాల్సిందే. ముక్క, సుక్క లేకపోతే అసలు పండుగలాగే అనిపించదు. పండుగలు వచ్చాయంటే అటు ప్రభుత్వానికి మస్త్ పైసల్ వస్తాయి. ఈ కోవలోనే ప్రభుత్వానికి క్రిస్మస్ బాగా కలిసొచ్చింది. 3 రోజుల్లో కేరళవాసులు రూ.154 కోట్ల మందు తాగేశారు. డిసెంబర్ 22, 23న రూ.84 కోట్ల మద్యం తాగగా.. క్రిస్మస్ రోజుతో కలుపుకుంటే అది రూ.154 కోట్లకు చేరింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం వచ్చింది.
మద్యం అమ్మకాల్లో చాలకుడి ఔవుట్‌లెట్ టాప్లో నిలిచింది. ఈ ఔట్‌లెట్లో రూ.63,85,290 లక్షల లిక్కర్ సేల్స్ జరిగాయి. ఆ తర్వాత 62 లక్షల 87 వేల120 రూపాయల విలువైన మద్యం విక్రయంతో చంగనస్సేరి రెండోస్థానంలో నిలిచింది. 62 లక్షల 31వేల 140 రూపాయల మద్యం విక్రయాలతో ఇరింజలకుడా ఆ తర్వాతి స్థానం దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే ఈ సారి లిక్కర్ సేల్స్ భారీగా పెరిగాయి. ఇటీవల జరిగిన ఓనం పండగ కూడా కేరళ ప్రభుత్వానికి మంచి కిక్కు ఇచ్చింది. 10 రోజుల్లో సుమారు రూ. 759 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. ఈ ఏడాది ఆగస్టులో కేరళవ్యాప్తంగా రూ.1799 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.