Home > జాతీయం > ఏఐతో కేటుగాళ్ల మాయ..ముఖం మార్చి 40వేలు కాజేశారు

ఏఐతో కేటుగాళ్ల మాయ..ముఖం మార్చి 40వేలు కాజేశారు

ఏఐతో కేటుగాళ్ల మాయ..ముఖం మార్చి 40వేలు కాజేశారు
X

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతోంది. ఏఐతో ఎన్నో అద్బుతాలు సృష్టిస్తున్నారు. అయితే దీన్ని లాభాలు పక్కనబెడితే నష్టాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు ఈ టెక్నాలజీ ఉపయోగించి కొత్త నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన కేరళలో జరిగింది.

కేరళ కోజికోడ్‌కు చెందిన రాధాకృష్ణన్‌ అనే వ్యక్తికి గుర్తుతెలియని ఒక నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. అవతలి వైపు మాట్లాడుతున్న వ్యక్తి ఏపీలోని అతని మాజీ కొలిగ్ను పోలి ఉన్నట్లు ఉంది. తనకు తెలిసిన వ్యక్తిలా కన్పించడంతో రాధాకృష్ణన్ ఫోన్ మాట్లాడారు. తన బంధువు ఆస్పత్రిలో ఉన్నారని.. చికిత్స కోసం రూ. 40,000 కావాలని కోరాడు. తెలిసిన వ్యక్తి కష్టాల్లో ఉండడంతో రాధాకృష్ణన్‌ 40వేలు పంపించాడు.

ఆ తరువాత కొంతసేపటికి మళ్ళీ రూ. 35,000 కావాలని అడిగాడు. దీంతో రాధాకృష్ణన్కి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. రంగంలోకి దిగిన పోలీసులు అసలు నిజాలు వెల్లడించారు. మోసానికి పాల్పడిన వ్యక్తి ఏఐ డీప్‌ఫేకింగ్‌ ఉపయోగించి డబ్బు కాజేసినట్లు పోలీసులు వివరించారు. ఈ లావాదేవీలు మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌కు జరిగినట్లు తెలిపారు. బాధితుడికి డబ్బు తిరిగి అప్పగించినట్లు సమాచారం. ఫ్రాడ్ కాల్స్ తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Updated : 20 July 2023 5:30 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top