Home > జాతీయం > టిక్కెట్టు లేకుండా వందేభారత్ ఎక్కి... అడ్డంగా బుక్కయ్యాడు

టిక్కెట్టు లేకుండా వందేభారత్ ఎక్కి... అడ్డంగా బుక్కయ్యాడు

టిక్కెట్టు లేకుండా వందేభారత్ ఎక్కి... అడ్డంగా బుక్కయ్యాడు
X

వందేభారత్‌ రైలులో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. టికెట్‌ తీసుకోకుండా వందే భారత్​ ట్రైన్ ఎక్కిన ఓ వ్యక్తి.. బాత్​రూమ్​లోకి వెళ్లి గడియ వేసుకున్నాడు. ఎంత పిలిచినా బయటకు రాలేదు. చివరకు తలుపు విరగ్గొట్టి అతడిని ఆర్పీఎఫ్​ అధికారులు బయటకు తీసుకువచ్చారు.

కేరళలోని కాసర్‌గోడ్‌ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కిన ఒక యువకుడు.. వెంటనే వాష్‌రూమ్‌లోకి దూరి, డోర్‌ లాక్‌ చేసుకున్నాడు. అధికారులు ఎంతచెప్పినా బయటకు రానంటూ మొండికేశాడు. ట్రైన్ టాయిలెట్‌లోనే దాదాపు 275 కి.మీ. ప్రయాణించాడు. అయితే చివరకు రైలు పాలక్కడ్‌ పరిధిలోని షోర్నూర్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే అధికారులు వాష్‌రూమ్‌ డోర్‌ పగులగొట్టి ఆ యువకుడిని బయటకు తీసుకువచ్చారు.

రెడ్ టీషర్టు ధరించి భయం భయంగా చూస్తున్న ఆ వ్యక్తి హిందీ మాట్లాడుతున్నాడని, స్వస్థలం ఆరా తీయాల్సి ఉందని చెప్పారు. తనను కొంతమంది తరుముకొంటూ వచ్చారని, వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరుగుదొడ్లోకి దూరి గడియ వేసుకున్నట్లు ఆ వ్యక్తి తెలిపాడు. తాను మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా చెప్పినట్లు సమాచారం.

Updated : 26 Jun 2023 11:19 AM IST
Tags:    
Next Story
Share it
Top