Pinarayi Vijayan : రేషన్ వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది.. కొత్తగా పబ్లిసిటీ ఎందుకు?: కేరళ సీఎం
X
రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫోటో ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. రేషన్ షాపుల్లో జాతీయ ఆహార భద్రత చట్టం లోగో , సీఎం మోదీ ఫోటో కూడిన బ్యానర్లు, సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయబోమని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం కేరళలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం జరిగిన సభలో ప్రతిపక్ష ఎమ్మెల్యే అబ్ధుల్ హమీద్ అడిగి ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు.
రాష్ట్రంలో ఎప్పటి నుంచే రేషన్ వ్యవస్థ ఉందని, కేవలం లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడుతుందన్నారు సీఎం. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇలాంటి చర్యల వల్ల ఒరిగేది ఏమీ లేదని విమర్శించారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని పినరయి విజయన్ చెప్పారు.గతంలో లైఫ్ మిషన్ పథకం కింద నిర్మించే ఇళ్లపై పీఎంఏవై లోగోను ఉంచాలన్న కేంద్రం ఆదేశాలను కూడా కేరళ ప్రభుత్వం తిరస్కరించింది.
కాగా గతంలో తెలంగాణలోని రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫొటోలపై కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ నిలదీసిన సంఘటన తీవ్ర రాజకీయకు దారి తీసింది. తాజాగా ఇదే విషయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ .. అలాంటి బ్యానర్లు తమ రాష్ట్రంలో అమలు చేయడం వీలుపడదని తేల్చి చెప్పారు.