దీపావళి జరుపుకుంటున్న హిందువులపై ఖలిస్తానీల దాడి
X
ఖలిస్తాన్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ ముఠా తాజాగా అమాయక ప్రజలను కూడా లక్ష్యం చేసుకుంటోంది. కెనడాలో దీపావళి పండగ చేసుకుంటున్న హిందువులపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడికి దిగారు. ఖలిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ భయానక వాతావరణం సృష్టించారు. గుర్తుతెలియని వస్తువులు విసిరి దాడి చేశారు. మిసిసాగా సిటీలోని వెస్ట్‌వుడ్ మాల్‌లో ఈ సంఘటన జరిగింది. వేడుకల మధ్యలోకి దూసుకెళ్లి ఆంటకాంలు సృష్టించారు.
ఖలిస్తాన్ జెండాలతో వెళ్తున్న గుంపు ఏవో కొన్ని వస్తువును హిందువులపై విసిరింది. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అక్కడి నుంచి వెళ్లమని చెప్పారు. హిందువులు కెనడాను వదిలేసి ఇండియాకు వెళ్లిపోవాలని ఖలిస్తాన్ ఉగ్రవాదులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. గత ఏడాది కూడా ఖలిస్తాన్ మద్దతుదారులు దీపావళి వేడుకలను అడ్డుకున్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై భారత్, కెనడాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరి రాయబారులను బహిష్కరించుకోవడం తెలిసిందే. హిందువుల ప్రార్థనా మందిరాలపై సిక్కు ఉగ్రవాదులు దాడులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే మైనారిటీలు, ప్రజాస్వామ్యం పేరుతో కెనడా ప్రభుత్వం వారిని ఉపేక్షిస్తోంది. ఖలిస్తాన్‌కు మద్దితిస్తున్నర కొంతమంది ధనిక సిక్కులు కెనడా ప్రభుత్వ నేతల దగ్గర లాబీయింగ్ చేస్తుండడమే దీనికి కారణమని భావిస్తున్నారు.